Eknath Shinde: హత్య బెదిరింపులపై స్పందించిన ఏక్‌నాథ్‌ షిండే.. ఏమన్నారంటే ?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షెండేకు వచ్చిన హత్య బెదిరింపులపై ఆయన స్పందించారు. గతంలో కూడా తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. తనపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయని.. కానీ వీటికి తాను భయపడలేదని స్పష్టం చేశారు.

New Update
Eknath Shinde

Eknath Shinde

Eknath Shinde: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షెండేకు గురువారం హత్య బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా షిండే స్పందించారు. గతంలో కూడా తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. తనపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయని అన్నారు. కానీ నేను వీటికి భయపడలేదని చెప్పారు. నక్సలైట్లు కూడా తనను బెదిరించారని.. వాళ్ల బెదిరింపులకు లొంగలేదన్నారు. 

Also Read: Maha Kumbh: కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!

Also Read: మహా కుంభమేళా చివరి రోజు ఆకాశంలో అద్భుతం!

ఇదిలాఉండగా...

షిండే వాహనాన్ని బాంబుతో పేల్చేస్తామని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబై పోలీసుల(Mumbai Police)కు ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. గురువారం మధ్యాహ్నం గోరెగావ్‌ పోలీసులకు ఓ మెయిల్‌ వచ్చింది. అందులో డిప్యూటీ సీఎం షిండే కారును బాంబుతో పేల్చేస్తామని బెదిరించారు. 

Also Read: Satya Nadella: ఇంటర్వ్యూ కోసం ఏకంగా సత్య నాదెళ్లకే మెయిల్‌..ఎంత సేపటిలో రిప్లై వచ్చిందో తెలుసా!

రాష్ట్ర సచివాలయం, జేజే మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చివరికీ ప్రాథమిక విచారలో ఈ బెదిరింపు అంతా ఓ బూటకమని తేలింది. ఈ మెయిల్స్‌  పంపి బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరు దుండగలును కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Also Read:  సర్కార్ కీలక నిర్ణయం.. ఆ మహిళలకు 60 రోజుల పాటు సెలవులు

ఈ మధ్యకాలంలో చాలామంది కొందరు కేటుగాళ్లు ఇలా మెయిళ్లు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, కంపెనీలు లేదా హై ప్రొఫైల్‌ కలిగిన వ్యక్తులను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. చివరికీ దీనిపై పోలీసులు విచారణ చేస్తే అదంతా బూటకమని తేలుతోంది. ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు