Maha Kumbh: కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!

కుంభమేళా జరుగుతున్న సంగమం నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్ చేసిందని ఎన్జీటీ సీరియస్ అయింది.  మేళా మొదలు కావడానిక ముందు రోజు నీటి నమూనాలను సేకరించి రిపోర్టులు ఎలా ఇస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

New Update
Maha Kumbhmela 2025

Maha Kumbhmela 2025

 కుంభమేళా నీటిపై ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు దాఖలు చేసిన రిపోర్ట్ మీద జాతీయ ట్రిబ్యునల్ మండిపడింది. నీటిలో ఫీకల్ కోలీఫామ్ ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మా సమయాన్ని వృధా చేయడానికా 250 పేజీల రిపోర్ట్ ను సమర్పించారు అంటూ ప్రశ్నించింది. అది కూడా కుంభమేళా జరగడానికి సరిగ్గా ఒక్కరోజు ముందే అంటే జనవరి 12న నీటి నమూనాలు సేకరించి ఎలా రిపోర్టులు ఇస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఎన్జీటీ సీరియస్ అయింది.  

Also Read: High Court: ఇలా అయితే హైడ్రాను మూసేయాల్సొస్తుంది..హైకోర్టు

Also Read :  కొణిదెల అంజనాదేవికి అస్వస్థత?

ఎందుకు అంత పెద్ద రిపోర్ట్?

ప్రయాగ్ రాజ్ లోని త్రివేణీ సంగమ ప్రాంతంలో నీటి నాణ్యత చాలా ఘోరంగా ఉందని...అందులో ఫీకల్ కోలీఫామ్ నిర్ణీత స్థాయికి మించి ఉందని...ఆ నీరు స్నానికి పనికిరాదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. అయితే ఫిబ్రవరి 18 యూపీపీసీబీ మాత్రం నీటి నాణ్యత చాలా బాగుందని నివేదిక ఇచ్చింది. దీంతో ఎన్జీటీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ ప్రకాశ్‌ శ్రీవాస్తవ, జ్యుడీషియల్‌ మెంబర్‌ జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌, ఎక్స్‌పర్ట్‌ మెంబర్‌ ఎ.సెంథిల్‌ వేల్‌తో కూడిన బెంచ్‌.. 19న దీనిపై విచారణ జరిపింది. అసలు యూపీపీసీబీ నీటి ఎక్కడ పరీక్షిస్తోంది...దానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారమూ లేదని ఎన్జీటీ అంది. అసలు నీటిలో ఫీకల్ కోలీఫామ్ కు సంబంధించి ఎలాంటి సమాచారం లేనప్పుడు...అంత పెద్ద రిపోర్ట్ ను ఎందుకు సమర్పించారు అంటూ మండిపడింది.  దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కుంభమేళా నీటిపై తగిన చర్యలు తీసుకుంటోందని..ఇటీవలే యూపీపీసీబీ కొన్ని నమూనాలు సేకరించిందని, ఆ వివరాలన్నింటితో కలిపి కొత్త అఫిడవిట్‌ను వారం రోజుల్లోగా దాఖలు చేస్తామని తెలిపింది. దీంతో ఎన్జీటీ తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. 

Also Read: Cricket: సచిన్, గంగూలీ అందరూ వెనక్కు..రోహిట్ @ 11000

Also Read :  ఇజ్రాయెల్ బస్సుల్లో పేలుళ్లు..ఉగ్రవాదుల పనేనా?

Advertisment
తాజా కథనాలు