/rtv/media/media_files/2025/04/10/78pp3I6jhRz5Fc3oMFlW.jpg)
Cooperative Bank Photograph: (Cooperative Bank)
కోఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్‌లో భారీ స్కామ్ బయటపడింది. కర్నాటకలోని ఓ బ్రాంచీలో సుమారు 63 కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగాయి. ఆ కేసులో సహకార బ్యాంక్ మాజీ చైర్మెన్ ఆర్ఎం మంజునాథ గౌడ్‌ను ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. మనీల్యాండరింగ్ చట్టం కింద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులోని ప్రత్యేక కోర్టులో అతన్ని ప్రవేశ పెట్టారు. మంజునాథ గౌడను సుమారు 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. చైర్మన్ మంజునాథ గౌడ్, శివమొగ్గ కోఆపరేటివ్ బ్యాంక్ మేజర్ కలిసి ఫ్రాడ్ చేశారు. అకౌంట్ హోల్టర్లకు తెలియకుండా గోల్డ్ లోన్ అకౌంట్లను అక్రమంగా ఓపెన్ చేసి నిధుల్ని స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని కోసం నకిలీ డాక్యుమెంట్లు సమర్పించినట్లు ఈడీ పేర్కొన్నది.
Aslo read: కంచ గచ్చిబౌలి భూవివాదం సెంట్రల్ కమిటీ హైదరాబాద్‌లో వారితో భేటి
Also Read : డిప్యూటీ ప్రధానిగా నితీశ్ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
Shivamogga Cooperative Bank - ED Uncovers
బెంగుళూరుతో పాటు శివమొగ్గ జిల్లాల్లో ఈడీ ఇటీవల తనిఖీలు చేపట్టింది. శివమొగ్గ జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్‌లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. భారీ స్థాయిలో నిధుల అవకతవకలు జరిగాయని, గౌడ ఆదేశాల మేరకు సిటీ బ్రాంచ్ మేనేజర్ బీ శోభ అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. ఈడీ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు బ్రాంచ్ మేనేజర్లు అందుబాటులో లేరు. లోకాయుక్త పోలీసుల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మేనేజర్ శోభతో కలిసి చైర్మెన్ 63 కోట్ల నిధుల్ని అక్రమంగా తరలించినట్లు ఈడీ పేర్కొన్నది. ఈ డబ్బులతో భారీగా ప్రవర్టీలు కొనుగోలు చేశారు.
Also Read : ఓటీటీలోకి వీరుడి కథ.. ‘ఛావా’ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఇదే
Also Read : Puri Jagannadh ఇట్స్ కన్ఫర్మ్.. పూరి సినిమాలో హీరోయిన్ గా టబు!
karnataka | shivamogga | co operative bank | euro-exim-bank-scam | ed | national news in Telugu | today-news-in-telugu | latest-telugu-news