Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూవివాదం సెంట్రల్ కమిటీ హైదరాబాద్‌లో వారితో భేటి

కంచ గచ్చబౌలి భూముల వివాదంలో విచారణ జరపడానికి ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. తాజ్‌కృష్ణలో HCUSU, ఏబీవీపీతో విద్యార్థి సంఘాలతో ఎంపవర్డ్ కమిటీ భేటీ అయ్యింది. కమిటీ సీఎస్ శాంతి కుమారి, పోలీస్ అధికారులను విచారించింది.

New Update
HCU land issue 123

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూవివాదంలో విచారణ జరపడానికి ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది.  బుధవారం సెంట్రల్‌ ఎంపవర్‌ కమిటీ ఛైర్మన్‌ సిద్ధాంత దాస్, మరో ఇద్దరు సభ్యులు హైదరాబాద్‌కు వచ్చారు. వీరు కంచ గచ్చిబౌలి భూముల్లో పరిశీలన జరిపి.. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి సుప్రీంకోర్టుకు నివేదిక అందించనున్నారు. విద్యార్థి సంఘాలతో ఎంపవర్డ్ కమిటీ భేటీ అయ్యింది. HCUSU, ఏబీవీపీతో విడివిడిగా కేంద్ర కమిటీ సమావేశమైంది. తాజ్‌కృష్ణలో సెంట్రల్ ఎంపర్డ్ కమిటీ భేటీ అయ్యింది. కంచ గచ్చిబౌలి భూములపై కమిటీ అధ్యయనం చేస్తుండగా.. సీఎస్ శాంతి కుమారి, పోలీస్ అధికారులను కలిశారు. ఇప్పటి వరకు జరిగిన అంశాలపై అధికారులను విచారించారు. 

Also Read: Allu Ajun-Atlee: కాపీరైట్ వివాదం..అల్లు అర్జున్, అట్లీ మూవీకి బిగ్ షాక్

Also Read :  పుర్రెతో ధనుష్ కొత్త సినిమా పోస్టర్.. నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ తో

Kancha Gachibowli Land Dispute

Also Read :  మందుబాబులకు షాకింగ్​ న్యూస్.. వైన్​షాపులు, కల్లు దుకాణాలు బంద్ - ఎప్పుడంటే!

Also Read :  తెలంగాణలో భారీ వర్షం.. ఈదరు గాలులతో హైదరాబాద్‌ అతలాకుతలం

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీతో తెలంగాణ ప్రభుత్వ అధికారుల భేటీ ముగిసింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు కేంద్ర సాధికారిక కమిటీ హైదరాబాద్‌కు వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. అనంతరం అధికారులతో భేటీ అయింది. దాదాపు 3 గంటలపాటు ప్రభుత్వ అధికారులతో కమిటీ భేటీ అయింది. సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, డీజీపీ జితేందర్‌, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. 400 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు, ప్రభుత్వ విధివిధానాలు, ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కమిటీకి నివేదిక సమర్పించారు.

Central Committee | hcu lands selling issue | HCU Land Dispute | 400 acres hcu land issue | Kancha Gachibowli land dispute | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు