Working Hours: ఆఫీసులో పనిగంటలపై ఆర్థిక సర్వే సంచలన విషయాలు

ప్రస్తుతం ఆఫీసులో పని గంటల అంశంపై విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్థిక సర్వే దీని గురించి ప్రస్తావించింది. వారానికి 60 గంటలకు పైగా పనిచేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని సర్వే హెచ్చరించింది.

New Update
Working Hours

Working Hours

Working Hours: వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి, 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆఫీసులో పని గంటల అంశంపై  విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్థిక సర్వే పనిగంటల అంశం గురించి ప్రస్తావించింది. వారానికి 60 గంటలకు పైగా పనిచేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని సర్వే హెచ్చరించింది. 

Also Read: వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2025-26 GDP గ్రోత్ రేట్ ఎంతంటే..?

ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం..

పలు అధ్యయనాల రిపోర్టులను కూడా ఇందులో ప్రస్తావించింది. ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం చూసుకుంటే.. '' ఆఫీసుల్లో ఎక్కువసేపు గడపడం అనేది మానసిక శ్రేయస్సుకు మంచిది కాదు. రోజుకు 12 లేదా అంతకంటే ఎక్కు పని గంటలు పనిచేసే వారు ఎక్కవగా బాధను అనుభవిస్తున్నారు. వారంలో ఎక్కువ పని గంటలు చేస్తే అది వాళ్ల ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) అధ్యయనాల రిపోర్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.  

Also Read: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్‌ రెబల్‌ స్టార్‌! 

పనిగంటల్లో ఉత్పాదకత పెరిగినా, వారానికి 55 - 50 గంటల మధ్య పని చేసిన ఆరోగ్యాన్ని దెబ్బతీయడమేనని WHO, ILO సంయుక్త అధ్యయన నివేదిక చెప్పింది. సుదీర్ఘంగా ఒకే దగ్గర కూర్చోని ఎక్కువ గంటలు పనిచేయడం మానసిక ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తుందని సపెయిన్‌ లాబ్స్‌ సెంటర్‌ ఫర్‌ హుమన్‌ బ్రెయిన్‌ అండ్‌ మైండ్‌ స్టడీ వెల్లడించిందని'' ఆర్థిక సర్వే తెలిపింది. 

Also Read: అలా చేస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తా.. ట్రంప్ హెచ్చరిక

అలాగే పనిగంటలపై పరిమితులు విధించడంపై ఆర్థి వృద్ధికి అవాంతరాన్ని కలించే అవకాశం ఉందని ఆర్థిక సర్వే చెప్పింది. అంతేకాదు ఇది కార్మికుల సంపాదన సామర్థ్యాన్ని కూడా దెబ్బ తీసే ఛాన్స్‌ లేకపోలేదని పేర్కొంది. అందుకే సౌకర్యవంతమైన పని గంటల విధానం భారత్‌ను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతుందని చెప్పింది. ఈ చర్యల వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమల పురోగతిని దోహదపడుతుందని స్పష్టం చేసింది.    

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు