EC Permission : విపక్ష నేతల మీట్ కు ఈసీ అనుమతి.. కానీ 300 కాదు... 30 మాత్రమే

గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ 25 విపక్ష పార్టీలకు చెందిన ఇండియా కూటమి  నేడు ఢిల్లీలో ర్యాలీ నిర్వహించాలని సంకల్పించింది. అయితే 300 మందికి అనుమతి ఇవ్వలేమని స్థల పరిమితి కారణంగా 30 మంది నేతలు మాత్రమే రావాలని ఈసీ పేర్కొంది.

New Update
EC Permission

గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ 25 విపక్ష పార్టీలకు చెందిన ఇండియా కూటమి  నేడు ఢిల్లీలో ర్యాలీ నిర్వహించాలని సంకల్పించింది. పార్లమెంట్‌ టు ఈసీ పేరుతో దాదాపు 300 మంది ఎంపీలు  పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు నిరసనలు చేస్తూ ర్యాలీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఈసీని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పలు రాజకీయ పార్టీల తరఫున కాంగ్రెస్‌ ఎంపీ జైరామ్‌ రమేశ్‌ఈసీకి లేఖ రాశారు.  కాగా విపక్ష ఏంపీలు ర్యాలీ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరిన ఎంపీ జైరామ్‌ రమేశ్‌ లేఖకు ఈసీ స్పందించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తమను కలిసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే 300 మందికి అనుమతి ఇవ్వలేమని స్థల పరిమితి కారణంగా 30 మంది నేతలు మాత్రమే రావాలని ఈసీ పేర్కొంది.

ఇది కూడా చూడండి:  New Tax Bill: నేడే లోక్ సభలో కొత్త పన్ను బిల్లు.. ప్రైవేట్ ఉద్యోగులకు భారీ ఉపశమనం

EC Permission For Opposition Leaders

కాగా, ఇండియా కూటమి నేతలకు నేడు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) విందు ఇవ్వనున్నారు. ఢిల్లీలోని చాణక్యపురి సమీపంలో గల హోటల్‌ తాజ్‌ ప్యాలెస్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం ఈ విందు ఇవ్వనున్నారు. ఓటు చోరీ ఆరోపణలు, బిహార్‌లోని ఎస్‌ఐఆర్‌పై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమి ఆందోళనకు సిద్ధమైంది. అందులో భాగంగా ఈ రోజు  ఇండియా కూటమి నాయకులు పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేయనున్నట్లు తెలిపారు. కాగా, వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంట్‌ ఉభయసభల్లో ఎస్‌ఐఆర్‌పై నిరసనలు వ్యక్తంచేస్తున్న విపక్షాలు దీనిపై చర్చకు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ రోజు ఈసీని కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతున్నాయి.

మరోవైపు రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిని నామినేట్‌ చేయాలని ఇండియా కూటమి(India Alliance) సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంపై ఏకాభిప్రాయం కోసం మల్లికార్జున ఖర్గే ప్రతిపక్షాలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. పేర్లను అన్వేషించి, దానిపై ఏకాభిప్రాయానికి రావడానికి ఖర్గే పార్టీలను సంప్రదిస్తున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఎన్‌డీయే కూటమి అభ్యర్థి పేరును ప్రకటించిన తర్వాతే కూటమి అభ్యర్థిని ఖరారు చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఈ రోజు జరిగే విందు సమావేశంలో కొంతమంది పేర్లను పరిశీలించడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగానే అభ్యర్థుల పేర్లను ఎంపిక చేసి ఎన్‌డీఏ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే తమ అభ్యర్థిని ప్రకటించడానికి విపక్షాలు సిద్దమవుతున్నాయి.

ఇది కూడా చూడండి:  ఫేక్‌ పోలీస్‌ స్టేషన్‌తో మోసం.. ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్న కేటుగాళ్లు

vote | congress | opposition-parties | opposition-leaders | latest-telugu-news | telugu-news | national news in Telugu

Advertisment
తాజా కథనాలు