Robinhood OTT: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

నితిన్-శ్రీలీల జంటగా వచ్చిన "రాబిన్ హుడ్" మూవీ రీసెంట్ గా థియేటర్లలో రిలీజై అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ మూవీ మే 2న స్ట్రీమింగ్‌కి సిద్ధమైనట్టు ప్రముఖ ఓటీటీ ప్లాటుఫారం జీ5 ప్రకటించింది. మరి ఓటీటీలో ఈ సినిమా విజయం సాధిస్తుందేమో చూడాలి.

New Update
Robinhood OTT

Robinhood OTT

Robinhood OTT: యంగ్ హీరో నితిన్(Nitiin), గ్లామరస్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) ప్రధాన పాత్రల్లో నటించిన "రాబిన్ హుడ్" సినిమా ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మార్చ్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ చేయడం, సినిమా ప్రమోషన్లు వినూత్నంగా ఉండటంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: 'ది రాజా సాబ్' ఉన్నట్టా లేనట్టా..? త్వరగా తేల్చండ్రా బాబూ..!

త్వరలోనే ఓటీటీలోకి

అయితే, రిలీజ్ తర్వాత అంచనాలు అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద సినిమాకి ఆశించిన స్పందన రాలేదు. త్వరలోనే ఓటీటీలోకి రానున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ZEE5 సొంతం చేసుకుంది.

Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్‌..!

తాజాగా జీ 5 సంస్థ అధికారికంగా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. రాబిన్ హుడ్ మూవీ మే 2 నుండి జీ 5 లో స్ట్రీమింగ్‌కి రానుంది. అంటే థియేటర్లలో విడుదలై నెలరోజుల్లోపే ఈ సినిమా ఓటీటీ వేదికపై అందుబాటులోకి రానుంది.

robinhood ott release
robinhood ott release

 

Also Read: మరో బడా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.

తక్కువ టైమ్‌లో ఓటీటీలోకి రాబోతున్న ఈ మూవీ, థియేటర్‌లో మిస్ అయినవారికి ఇప్పుడు ఇంట్లోనే చూసే ఛాన్స్ దక్కింది. మరి థియేటర్లలో ఫెయిలైన ఈ మూవీ ఓటీటీలో మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి!

Also Read: చక్రం క్లైమాక్స్ రిపీట్.. ప్రభాస్ ను చంపబోతున్న మరో డైరెక్టర్..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు