/rtv/media/media_files/2025/04/19/OX2s0WmfMkQ20nQ13mDC.jpg)
Hero Surya
Hero Surya: తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సూర్య, మరోసారి తన అభిమానులతో భేటీ(Surya Fans Meet) అయ్యారు. ప్రతి ఏడాది తరహాలోనే ఆయన అభిమానుల కోసం ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 15, 16 తేదీల్లో తమిళనాడులోని ఓ పెద్ద కల్యాణమండపంలో ఈ మీట్ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 4వేల మంది అభిమానులతో సూర్య ఆనందంగా సమయాన్ని గడిపారు.
Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ప్రతి సంవత్సరం రెండు సినిమాలు
అభిమానుల ప్రేమకు గుర్తుగా, వారితో స్వయంగా మాట్లాడిన సూర్య, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి, ఫోటోలు దిగాడు. ముఖ్యంగా గతేడాది ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ- "ప్రతి సంవత్సరం రెండు సినిమాలు చేస్తాను" అని వెల్లడించాడు. ఫ్యాన్స్ సంగతులు తెలుసుకుంటూ, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
Also Read: 'ది రాజా సాబ్' ఉన్నట్టా లేనట్టా..? త్వరగా తేల్చండ్రా బాబూ..!
@Surya Anna Entry
— SUBRAMANIAN (@subramani2308) April 15, 2025
South Fans meet 😁 Sakthi palace Hall in Chennai pic.twitter.com/kD7wzu6x2U
ఈ మీటింగ్‌లో తన అప్‌కమింగ్ మూవీ ‘రెట్రో’ గురించి కూడా సూర్య మాట్లాడాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉంది. మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది. సీబీఎఫ్‌సీ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా రన్‌టైమ్ మొత్తం 2 గంటల 48 నిమిషాలు.
Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!
గతంలో ‘కంగువా’ అనుకున్నంతగా హిట్ కాకపోవడంతో, ఇప్పుడు అభిమానులంతా ‘రెట్రో’పై ఆశలు పెట్టుకున్నారు. సూర్య తన అభిమానులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాడా? ఈ సినిమా మరో సూపర్ హిట్ అవుతుందా? అన్నది మే 1న తెలియబోతుంది!
Also Read: చక్రం క్లైమాక్స్ రిపీట్.. ప్రభాస్ ను చంపబోతున్న మరో డైరెక్టర్..?