Jaipur: స్కూల్లో వేధింపులే ఆత్మహత్యకు కారణం..జైపూర్ తొమ్మిదేళ్ల పాప అమైరా తల్లిదండ్రులు

జైపూర్ లో ఆత్మహత్య చేసుకున్న అమైరా ఆత్మహత్యకు కారణం స్కూల్లో వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏడాది నుంచి ఆమె బాధపడుతోందని చెప్పారు.

New Update
amira

నవంబర్ 1న జైపూర్ లోని నీర్జా మోడీ స్కూల్లో చదువుతున్న తొమ్మిదేళ్ల అమైరా(school-students) తన స్కూల్ బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య(suicide) చేసుకుంది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. పాప మరణంపై ఆమె తల్లిదండ్రులు స్కూలు వాళ్ళే కారణం అని ఆరోపిస్తున్నారు. తమది చాలా ప్రశాంతమైన కుటుంబమని..ఇంట్లో ఎటువంటి సమస్య లేదని చెప్పారు. స్కూల్లో అమైరా వేధింపులకు గురైందని చెబుతున్నారు. లైంగిక అర్థాలు వచ్చే మాటలతో పాపను హింసించారని...ఏడిపించారని అమైరా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితమే పాప తమకు ఈ విషయం చెప్పిందని..తనకు స్కూల్ కు వెళ్ళడం ఇష్టం లేదని..నన్నుపంపొద్దని చెప్పిందని అన్నారు. అప్పుడే తాము స్కూల్లో ఫిర్యాదు చేశామని..అమైరా మాటలను రికార్డ్ కూడా చేసి స్కూల్ టీచర్ కు పంపించామని వారు చెబుతున్నారు. కానీ స్కూల్ టీచర్లు ఏమీ పట్టించుకోలేదని ఆరోపించారు. పైగా కో ఎడ్యుకేషన్ స్కూల్లో మగపిల్లలతో కలిసి చదువుకోవడం అలవాటు చేసుకోవాలని చెప్పారని తెలిపారు.

Also Read :  శంషాబాద్‌లో  పలు విమానాలు ఆలస్యం..ప్రయాణీకుల ఆందోళన

స్కూల్లో ఏదీ సరిగ్గా లేదు..

మరోవైపుఅమైరా ఆత్మహత్యపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. పాప చనిపోయే ముందు రెండు సార్లు టీచర్ దగ్గరకు వచ్చి వెళ్ళడం సీసీ టీవీల్లో గమనించామని చెప్పారు. అయితే టీచర్ తో ఏం మాట్లాడిందో మాత్రం తెలియలేదని చెప్పారు. తరగతి గదిలో సీసీ కెమెరాల్లో ఆడియో తప్పనిసరి చేసినప్పటికీ ఫుటేజ్ లో శబ్దం లేదని పోలీసులు చెబుతున్నారు. దీనిపై స్కూల్ యాజమాన్యంతో మాట్లాడుతున్నామని తెలిపారు. అంతేకాక 5 వేల మంది కంటే ఎక్కువ మంది ఉన్న స్కూల్ బిల్డింగ్ కు భద్రత కోసం గ్రిల్ లేదా నెట్ లేదు. అదనపు అంతస్తులు కూడా నిర్మించారు. దీనికి వారికి ఎలా పర్మిషన్ వచ్చింది. చుట్టూ చాలా మంది పిల్లలు ఉన్నప్పుడు మీరు ఓపెన్ ఫ్లోర్‌లను ఎలా కలిగి ఉంటారు? CBSE మార్గదర్శకాల ప్రకారం CCTVలోఉండవలసిన ఆడియో ఎందుకు అందుబాటులో లేదు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జైపూర్ లో నిర్జా మోడీ స్కూల్ చాలా ప్రతిష్టాత్మకమైనది. దీనికి అక్కడ చాలా పేరు ఉంది. ఫీజులను కూడా దండిగానే వసూలు చేస్తారు. కానీ సేఫ్టీ మాత్రం లేదు అంటూఅమైరా మామ సాహిల్ స్కూల్ యాజమాన్యంపై విరుచుపడ్డారు. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం చెడు పదాలు మాట్లాడిన విషయం తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు.

Also Read: BIG BREAKING: జమ్మూ-కాశ్మీర్ లో ఆపరేషన్ పింపుల్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

Advertisment
తాజా కథనాలు