Trump: నేను భారత్-పాక్ యుద్ధం ఆపలేదు.. మాట మార్చిన ట్రంప్

భారత్‌-పాక్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం చేశానని చెప్పుకోవడం లేదని ట్రంప్ అన్నారు. భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో వాటి సమస్యను పరిష్కరించేందుకు మాత్రం సాయం చేశానన్నారు.

New Update
Donald Trump

Donald Trump

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ట్రంప్‌ మాట మార్చారు. తాను ఇది చేశానని చెప్పుకోవడం లేదని అన్నారు. కానీ భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో వాటి సమస్యను పరిష్కరించేందుకు మాత్రం సాయం చేశానని తెలిపారు.

Also Read :  దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్.. రాజమౌళి సినిమాకు డైరెక్టర్ గా నేషనల్ అవార్డు విన్నర్

Donald Trump Key Comments On India-Pakistan Ceasefire

 Also Read: ట్రంప్ ఫ్యామిలీతో పాకిస్థాన్ వ్యాపారం.. అసలేం జరుగుతోంది?

మరోవైపు భారత్‌ కూడా ట్రంప్ తాను మధ్యవర్తిత్వం వహించానని చెప్పిన వ్యాఖ్యలను ఖండించింది. కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఏ సమస్యైన భారత్-పాక్‌ మధ్య ద్వైపాక్షిక చర్చల వల్లే పరిష్కారమవుతాయని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా.. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు భారత్-పాక్ వార్ అంశంలో ట్రంప్‌కు కేంద్ర మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండో -పాక్‌ చర్చల్లో మూడో వారి జోక్యం అవసరం లేదన్నారు. భారత్‌ కేవలం పీవోకే, టెర్రరిస్టుల గురించే మాట్లాడుతుందని, పాక్‌ ఉగ్రవాదులను అప్పగించాల్సిందేనని హెచ్చరించారు. అంతేకాదు టెర్రర్‌ క్యాంప్స్‌ను మూసివేయాలని వార్నింగ్ ఇచ్చారు. సింధూ జలాల నుంచి చుక్క నీరు పాక్‌కు ఇవ్వమని, కాల్పుల విరమణ పాకిస్తానే కోరుకుంటుంది తప్పా భారత్ కాదని చెప్పారు. 

Also Read :  సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్, మంత్రులు

Also Read :  పబ్లిక్‌లో యువతి ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని బీజేపీ నేత డ్యాన్స్.. వీడియో వైరల్!

telugu-news | rtv-news | india-pakistan

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు