Dadasaheb Phalke: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'దేవర పార్ట్ 2' తో పాటు వార్ 2, ప్రశాంత్ నీల్ తో 'డ్రాగన్' సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తారక్ తదుపరి ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. తారక్ తన కెరీర్ లో మరో కొత్త ప్రయోగాత్మక ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఎన్టీఆర్... ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలవబడే 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్ లో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేషనల్ అవార్డు విజేత నితిన్ కక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
రెండేళ్ల క్రితమే
అయితే రెండేళ్ల క్రితమే డైరెక్టర్ రాజమౌళి 'Made In India' పేరుతో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ, వరుణ్ గుప్తా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే నేషనల్ అవార్డు విజేత నితిన్ కక్కర్ డైరెక్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఎప్పుడో సెప్టెంబర్ 2023లో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్. ఇప్పుడు ఎన్టీఆర్ పేరుతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
నిర్మాతలు కార్తికేయ, వరుణ్ గుప్తా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి కథను ఎన్టీఆర్‌కు వినిపించగా.. బాగా నచ్చేసిందంట. కథ విని తారక్ ఆశ్చర్యపోయినట్లు సమాచారం. ఈ సినిమా భారత సినిమా పుట్టుక, దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా రూపొందనుంది. దర్శకుడు నితిన్ కక్కర్, గతంలో ‘ఫిల్మిస్తాన్’, ‘నోటుబుక్’ వంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలు తీశారు.
telugu-news | cinema-news | telugu-cinema-news | ntr | Made In India Movie | Jr NTR Dadasaheb Phalke | ss-rajamouli