Dharmasthala: అసలు ధర్మస్థల ఎక్కడుంది? ఆ ఆలయ చరిత్ర, వివాదాలు ఏంటి?

కర్ణాటకలోని ప్రసిద్ధ ఆధ్యాత్రిక క్షేత్రమైన ధర్మస్థలలో అనుమానస్పద మృతదేహాలు బయట పడటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట్‌ విచారణ చేస్తోంది. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

New Update
Dharmasthala mass burial case and the history of Temple

Dharmasthala mass burial case and the history of Temple

కర్ణాటకలోని ప్రసిద్ధ ఆధ్యాత్రిక క్షేత్రమైన ధర్మస్థలలో అనుమానస్పద మృతదేహాలు బయట పడటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట్‌ విచారణ చేస్తోంది. శ్రీక్షేత్ర దగ్గర్లోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను తానే పూడ్చి పెట్టానని అప్పట్లో అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అతడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం అధికారులు కొన్ని అవశేషాలు గుర్తించారు. 13 ఏళ్ల చిన్నారి అస్థి పంజరంతో పాటు మానవులకు సంబంధించిన 15 ఎముకలు, లో దుస్తులు దొరికినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. 

Also Read: 100 రోజులు..12 మంది ఉగ్రవాదులు..కశ్మీర్ లో కొనసాగుతున్న వేట

ఇక వివరాల్లోకి వెళ్తే.. పారిశుద్ధ్య కార్మికుడిని గత సోమవారం సిట్‌ అధికారులు తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. నేత్రావతి నది స్నాన ఘట్టానికి సమీపంలో ఈ దర్యాప్తు ప్రారంభించారు. అతడు 13 చోట్ల మృతదేహాలు పూడ్చిన ప్రాంతాలు చూపించగా.. అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం ఆరో ప్రాంతంలో మానవ అవశేషాలను గుర్తించారు. వాటిని సేకరించిన ఫోరెన్సిక్ టీమ్‌ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించింది. ల్యాబ్‌లో పరీక్షలు చేసిన తర్వాత వాటికి సంబంధించిన వివరాలు బయటపడుతాయని సిట్‌ అధికారులు చెప్పారు.    

పారిశుద్ధ్య కార్మికుడు ఏం చెప్పాడు 

ఈ ఏడాది జులై 3న ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ధర్మస్థల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. తాను 20 ఏళ్లు ధర్మస్థలిలో పనిచేసినట్లు చెప్పాడు. ఆ సమయంలోనే వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టినని.. మృతుల్లో యువతులు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారని చెప్పాడు. వీళ్లలో కొందరిపై లైంగిక దాడులు, యాసిడ్‌ దాడులు జరిగాయని చెప్పాడు. దీంతో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాకైపోయారు. అనంతరం పోలీసులకు వివరంగా విషయాలు వెల్లడించాడు. '' నేను దళితుడిని. 1995లో ధర్మస్థల ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాను. ఆ గుడికి దగ్గర్లో ఉన్న నేత్రవాతి నది వద్ద పనిచేశారు. అక్కడున్న పరిసరాలను శుభ్రం చేయడమే నా పని. ఓ రోజు ఆలయానికి చెందిన సూపర్‌వైజర్ల నుంచి నాకు ఆదేశాలు వచ్చాయి. టీనేజీ అమ్మాయిలను, చిన్నారుల మృతదేహాలను ధర్మస్థలి అటవీ ప్రాంతంలో పాతిపెట్టాలని బలవంతం చేశారు. 

చంపేస్తామని బెదిరించారు

చనిపోయిన వాళ్లందరూ ధర్మస్థల ప్రాంతానికి దగ్గర్లో రోడ్డు ప్రమాదాలు గురైనవారు, సూసైడ్‌ చేసుకున్న వాళ్లని అనుకున్నాను. కొన్ని రోజులకి మృతదేహాలపై గాయాలు, లైంగిక దాడులు జరిగినట్లు తెలిసేలా కొన్ని గుర్తులు కనిపించాయి. కొన్ని మృతదేహాలకు కనీసం లోదుస్తులు కూడా లేవు. ఏదో తప్పు జరిగిందన్న అనుమానం వచ్చింది. సూపర్‌వైజర్లను అడిగాను. వాళ్లు నన్ను తిట్టారు, కొట్టారు కూడా. వాళ్లు చెప్పింది వినకపోతే చంపేస్తామని బెదిరించారు. నా కుటుంబాన్ని కూడా చంపేస్తామన్నారు. ఇక చేసేదేమి లేక నేను భయంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని కొనసాగించాల్సి వచ్చింది.  

2010లో పూడ్చిపెట్టిన ఓ బాలిక డెడ్‌బాడీపై స్కూల్‌ యూనిఫాం ఉండటం గమనించాను. ఆమెపై రేప్‌ జరిగినట్లు అర్థం అయ్యింది. సూపర్‌వైజర్లు నాకు స్కూల్‌బ్యాగ్‌తో సహా ఆమెను పాతిపెట్టాలని చెప్పారు. అలాగే 20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి, చంపినట్లు గుర్తించాను. ఆమె ముఖంపై యాసిడ్ కూడా పోశారు. ఆమెకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకొద్దని.. తన చెప్పులు, ఇతర వస్తువులు అన్ని కూడా శవంతో పూడ్చివేయాలని చెప్పారు. ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు మరికొందరిని పెట్రోల్‌తో కాల్చేవారు. 

అక్కడి నుంచి పారిపోయాను

20 ఏళ్లలో యువతులు, బాలికలు అలాగే గొంతు కోయపడి చనిపోయిన కొందరు పురుషుల మృతదేహాలను తీసుకెళ్లి పాతిపెట్టాను. నా కుటుంబాన్ని సూపర్‌వైజర్లు ఏం చేస్తారన్న భయంతో 2014 దాకా ఈ పనిచేశాను. 2014 డిసెంబర్‌లో  సూపర్‌వైజర్లకు సన్నిహితుడైన ఓ వ్యక్తి  మా కుటుంబంలోని ఓ మైనర్‌ బాలికపై కన్నేశాడు. ఆమెను అతడు వేధించేవాడు. దీంతో నేను కుటుంబంతో కలిసి ధర్మస్థల నుంచి పారిపోయాను. 

ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడే ఉన్నాను. నేను చేసిన తప్పు ఇంకా నన్ను వెంటాడుతూ ఉంది. అందుకే అప్పట్లో జరిగిన దారుణాలన్ని ఇప్పుడు చెబుతున్నాను. నేను చెప్పేది నిజమని మీకు నిరూపించేందుకు నేను రెడీ. బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫీ లాంటి పరీక్షలకు నేను సిద్ధం. గతంలో నేను మృతదేహాలను పూడ్చిపెట్టిన ప్రాంతాలు నాకు ఇంకా గుర్తున్నాయని'' ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు. అంతేకాదు గతంలో అతడు పాతిపెట్టిన ఓ బాధితురాలి పుర్రె ఫొటోలను కూడా పోలీసులకు ఇచ్చాడు. తన కుటుంబానికి రక్షణ కల్పిస్తే సూపర్‌వైజర్ల పేర్లు కూడా చెప్తానన్నాడు. అతడు చెప్పిన విషయాలు బయటికి రావడంతో గతంలో తమవారిని కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు.

జైన కుటుంబం నిర్మించిన ఆలయం

ధర్మస్థలిలో శ్రీ మంజునాథుని ఆలయం ఉంది. పురాణాల ప్రకారం.. ఈ ఆలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ధర్మస్థలిని 'కుడుమ' అని పిలిచేవారు. ఈ గ్రామంలో హెగడే అనే జైన కుటుంబం నివసించేది. ఈ కుటుంబానికి ధర్మం, న్యాయం పాటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఓ రోజు వారికి దేవతలు కలలో కనిపించి ధర్మాన్ని పాటించేందుకు ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హెగడే కుటుంబం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడి వారు నమ్ముతారు. హెగడే కుటుంబం వాళ్లే ఆలయానికి ధర్మకర్తలుగా కొనసాగుతూ వస్తున్నారు. 

Also Read: పాక్, బంగ్లాపై ట్రంప్ టారిఫ్‌ మినహాయింపు.. భారత్‌పై అమెరికా కుట్ర!

ఈ ఆలయం మత సామరస్యానికి ప్రతీక. హెగడే కుటుంబ పెద్దను ధర్మాధికారి అని పిలుస్తారు. ఆయన ఆలయ బాధ్యతలతో పాటు స్థానికుల సమస్యలను పరిష్కరిస్తారు. ప్రస్తుతం ధర్మాధికారిగా డా.వీరేంద్ర హెగ్డే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి కర్ణాటక ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా భక్తులు వస్తారు. అయితే 1998 నుంచి 2014 మధ్య ఈ ప్రాంతంలో చాలామంది మహిళలు, యువతులను హత్య చేశారని.. వాళ్ల మృతదేహాలు తానే స్వయంగా పూడ్చిపెట్టానని అప్పట్లో అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. 

గతంలో కూడా వివాదాలు

ధర్మస్థలలో 2012లో సౌజన్య(17) అనే యువతి కేసు సంచలనం రేపింది. ఆమెపై అత్యాతారం చేసి హత్య చేసినట్లు ఫోరెన్సిక్‌ రిపోర్టులో తేలింది. అయితే ధర్మస్థల ఆలయ నిర్వాహకులకు సంబంధించిన వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితురాలి కుటుంబీకులు ఆరోపణలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. అలాగే 1987లో పద్మలత (17) పై కూడా ఇలాగే హత్యాచారం జరిగింది. 2003లో అనన్యభట్ అనే మెడికల్ విద్యార్థి కూడా ధర్మస్థలిలో అదృశ్యమవ్వడం దుమారం రేపింది. ప్రస్తుతం ధర్మస్థల కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది.

buried bodies dharmasthala | Dharmasthala case updates | karnataka | rtv-news | telugu-news | national news in Telugu | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు