/rtv/media/media_files/2025/05/18/kPFjP2qMV7PJApOq6UyH.jpg)
Indian Army posts a video of Operation Sindoor on its social media handle 'X'
పహల్గాంలో ఉగ్రదాడి జరిగి 100 రోజులు దాటింది. గడచిన వందరోజులుగా భద్రతా బలగాలు కంటిమీద కునుకులేకుండా కశ్మీర్ అడవులను జల్లెడ పడుతున్నాయి. కశ్వీర్ లో చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా ఇప్పటివరకు 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వారిలో ఆరుగురు ఉగ్రవాదులు పాకిస్థానీయులు ఉన్నారని భద్రతావర్గాలు వెల్లడించాయి. మిగిలిన ఆరుగురు కూడా జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడులతో సంబంధం ఉన్నవారేనని తేల్చిచెప్పాయి.
ఇది కూడా చూడండి:Donald Trump Tariffs: ప్రపంచ దేశాలపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. ఈ దేశాలపైనే అత్యధిక టారిఫ్‌లు..?
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ ఘటనలో అనేకమంది అమాయకులు బలయ్యారు. దీన్ని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో నిర్వహించిన తీవ్రవాద కార్యక్రమంలో పాకిస్థాన్ కు దీటుగా బదులిచ్చింది. మే7న ప్రారంభమైన ఆఫరేషన్ సిందూర్ లో పలువురు ఉగ్రవాదులను హతమార్చింది. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించినప్పటికీ ఆ తర్వాత కూడా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ఇండియా ప్రకటించింది. ఆ తర్వాత కూడా ఉగ్రవాదులను పట్టుకునేందకు ఆర్మీ అనేక ఆపరేషన్లను నిర్వహించింది. వాటిలో ఆపరేషన్ మహాదేవ్ కూడా ఒకటి ఈ ఆపరేషన్ లో పహల్గాం దాడిలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాదులను మట్టుబెట్టింది.ఈ ఆపరేషన్‌లోనే పహల్గాం ఘటన బాధ్యులు హతమయ్యారని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు జరిగిన శివశక్తి ఆపరేషన్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇవి మచ్చుకు మాత్రమే ఉగ్రవాదులను హతమార్చడం కోసం ‘‘ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయో చెప్పడం కష్టం. జమ్మూకశ్మీర్‌లోని అన్ని యూనిట్లు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి’’ అని ఆర్మీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఆ ఆపరేషన్లలో మే 15న షోపియాన్‌లోని కెల్లర్ అడవుల్లో ముగ్గురు ఉగ్రవాదులు, నాదెర్ ప్రాంతంలో ఇంకో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.
Also Read : అత్యాచారం కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బిగ్ షాక్
Counter-Terrorism Operations
ఆపరేషన్ సిందూర్ ద్వారా పహల్గాం దాడికి కుట్ర పన్నిన కుట్రదారులను, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఆనాటి ఊచకోతలో పాల్గొన్న ముష్కరులను హతమార్చామని ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత దళాలు.. భారత్ పాక్ సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ లక్ష్యాలపై దాడి చేశాయని అమిత్ షా ప్రకటించారు. మన బలగాలు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక దాడిలో సుమారు100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సైన్యం ప్రకటించింది. పహల్గాంలో దాడి జరగడానికి ముందు పీఓకేలోని 42 లాంచ్ ప్యాడ్లలో 110 నుంచి 130 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. అదే సమయంలో కశ్మీర్‌లో 70 నుంచి 75 మంది , జమ్ము, రాజౌరీ, పూంచ్‌లలో 60 నుంచి 65 మంది ఉగ్రవాదులు తమ కార్యకలపాలు నిర్వహిస్తున్నారని భారత్ బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వీరిని సైతం మట్టుబెట్టడానికి మరిన్ని ఆపరేషన్లు నిర్వహించడానికి భారత భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ అధికారులు ప్రకటించారు.
pakistan | attack in Pahalgam | Jammu and Kashmir | latest-telugu-news | telugu-news | national news in Telugu | telugu crime news