/rtv/media/media_files/2025/10/23/16-year-old-boy-kills-mother-with-axe-in-haryana-2025-10-23-20-10-51.jpg)
16-Year-Old Boy Kills Mother With Axe In Haryana
హర్యానాలోని కురుక్షేత్రలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్న తల్లినే గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న బాలుడి కోసం వెతుకుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ముఖేష్ రాణి (45) అనే మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత లాడ్వా ప్రాంతంలో ఓ ఇంట్లో వేరుగా ఉంటోంది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు.
Also Read: ఫ్రెండ్‌షిప్ అంటే అత్యాచారానికి లైసెన్స్ కాదు.. కోర్టు కీలక వ్యాఖ్యలు
పెద్ద కొడుకు విదేశానికి వెళ్లిపోయాడు. ఆమె చిన్న కొడుకు (16) మాత్రం తన భర్తతోనే కలిసి ఉంటున్నాడు. అయితే మంగళవారం రాత్రి చిన్నకొడుకు తల్లి ముఖేష్ రాణి ఇంటికి వెళ్లాడు. గొడ్డలితో ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ముఖం, తలపై తీవ్రంగా గాయపడటంతో రాణి రక్తపు మడుగులో పడిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
Also Read: అమెరికాలో ముగ్గురి చావుకు కారణమైన భారతీయుడు.. భయంకరమైన VIDEO
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కోసం గలిస్తున్నారు. అయితే ఆ యువకుడు తల్లిపై ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు అనే దానిపై క్లారిటీ లేదు. ఇంట్లో గొడవలు ఉన్నాయా ? అతడి మానసిక పరిస్థితి సరిగా లేదా ? వంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: అలర్ట్.. ముంచుకొస్తున్న మరో మహమ్మరి.. తొలి కేసు నమోదు!
Follow Us