/rtv/media/media_files/2025/01/31/7oA6cZoCPnfSJpA73GU9.jpg)
bhoondi laddu
ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల (Delhi Crime Branch Police) స్పెషల్ ఆపరేషన్ తో అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే రోజున ‘‘ బూందీ లడ్డూ’’ (Boondi Laddu) ని పంచుతూ అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. పెరోల్ పొందిన తర్వాత దోషి పరారీలో ఉన్నాడు. 2008లో ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యని హత్య చేసిన కైలాష్(40) అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు.
హత్య నేరం కింద దోషిగా తేలిన కైలాష్ 2011లో 3 నెలల పెరోల్ కింద విడుదలయ్యాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా వివిధ ప్రదేశాలకు పారిపోతున్నాడు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని శివపురిలో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో 3 నెలల పెరోల్ తర్వాత లొంగిపోకుండా 2021 నుంచి పరారీలో ఉన్నట్లు ఏసీపీ క్రైమ్ బ్రాంచ్ సంజయ్ కుమార్ సైన్ తెలిపారు.
Also Read: Maha Kumbh Stampede: ఆ క్షణంలో ఏం జరిగిందంటే.. కుంభమేళా తొక్కిసలాట బాధితుల కన్నీటి కథ
అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మకాం మార్చుతూనే ఉన్నాడు. మొదట్లో ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో నివసించేవాడు. ఆ తర్వాత రెండేళ్లు హరిద్వార్‌కి మకాం మార్చాడు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని సొంత ఊరు వచ్చి రోజూవారీ కూలీగా పనిచేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది.
‘‘బూందీ లడ్డూలు’’...
అయితే, ఎలాంటి అనుమానం వచ్చినా మళ్లీ పారిపోతాడని తెలిసి, అధికారులు గణతంత్ర దినోత్సవం రోజు (Republic Day) గ్రామస్తులతో కలిసి ‘‘బూందీ లడ్డూలు’’ పంచి పెట్టారు. అదే సమయంలో తెలివిగా కైలాష్‌ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలు అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.