/rtv/media/media_files/2025/01/30/z4idjLzjFoU9kiG8KzxK.jpg)
US plane collides with Army chopper near Washington all 67 dead
అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. విమానం, హెలికాఫ్టర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో విమానం, హెలికాఫ్టర్ రెండూ ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. అప్పటికే విమానంలో 60 మంది దాకా ప్రయాణికులు, నలుగురు స్టాఫ్ ఉన్నట్లు తెలిసింది. అలాగే హెలికాఫ్టర్‌లో ముగ్గురు పైలెట్లు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం తర్వాత పద్ధెనిమిది మంది మరణించినట్లు తెలిసింది.
Also Read : నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్!
తాజాగా ఈ ప్రమాదంలో మరణించిన మృతుల సంఖ్యను అధికారులు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని.. అందరూ మరణించారని అధికారులు తెలిపారు. ఇప్పటికి విమానంలో 27 మంది డెడ్ బాడీలను, హెలికాఫ్టర్‌లో ఒకరి డెడ్ బాడీని గుర్తించినట్లు వాషింగ్టన్ డీసీ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జాన్ ఎ.డొనెల్లీ వెల్లడించారు.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్
ఈ ప్రమాదంలో సెలబ్రెటీలు కూడా ఉన్నట్లు తెలిసింది. రష్యాకు చెందిన స్కేటింగ్ ఛాంపియన్స్ ఎవజెనియా సిస్కోవా, వాదిమ్ నౌమువ్ కపుల్ దురదృష్టవశాత్తూ ఈ విమాన ప్రమాదంలో మరణించారు. కాగా ఈ స్కేటింగ్ కపుల్ 1990లో వరల్డ్ ఛాంపియన్స్‌గా రికార్డు సృష్టించారు.
ఏం జరిగిందంటే?
Also Read : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..
వాషింగ్టన్ లో రీగన్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయంలో హెలికాఫ్టర్ ల్యాండ్ అవుతుండగా..పీఎస్‌ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చిన్న విమానం దానికి అడ్డుగా వచ్చింది. దీంతో రెండూ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో విమానం, హెలికాఫ్టర్ రెండూ ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. హెలికాఫ్టర్ లో పైలెట్లు ముగ్గురు ఉండగా..విమానంలో 60 దాకా ప్రయాణికులు, నలుగురు స్టాఫ్ ఉన్నట్టు తెలిసింది. అనంతరం ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు.
Webcam at the Kennedy Center caught an explosion mid-air across the Potomac. https://t.co/v75sxitpH6 pic.twitter.com/HInYdhBYs5
— Alejandro Alvarez (@aletweetsnews) January 30, 2025
ఒకే సమయంలో ల్యాండ్ అయ్యాయి..
రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పీఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్యాసెంజర్ వియాన కాన్సాస్ లోని విషిటా ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరింది. ఒక గంట తర్వాత ఇది వాషింగట్ రోనాల్డ్ రీగన్ ఎయర్ పర్ట్ రన్ వే మీద దిగేందుకు సిద్ధమైంది. ఇంతలో అదే సమయానికి ల్యాండింగ్ అవుతున్న రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్-60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్ దీనిని ఢీ కొట్టింది. రెండు ఆకాశంలోనే గుద్దుకున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు పెద్ద శబ్దం వినిపించింది. ఆ తరువాత హెలికాఫ్టర్, విమానం రెండూ ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో పడిపోయాయి.
ప్రమాదం జరిగిన వెంటనే రీగన్ ఎయిర్ పోర్ట్ ను మూసేశారు. అన్ని సేవలను వెంటనే నిలిపేశారు. హెలికాఫ్టర్, ఫీఎస్ఏ ప్యాసెంజర్ విమానం రెండూ ఒకే సమయంలో ల్యాండ్ అవడానికి ప్రయత్నిండంతోనే ప్రమాదం సభవించిందని ఎయిర్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు. అయితే ఏ రెండు విమానాలకు ఒకేసారి ల్యాండ్ అవడానికి అనుమతి ఇవ్వరు. అది కూడా ఒకే ప్రదేశంలో ఇవ్వడానికి అస్సలు ఇవ్వరు. కానీ ఎక్కడ తప్పిదం జరిగిందో తెలియడం లేదని అంటున్నారు.