Japan: స్నానం చేయొద్దు, బట్టలు ఉతకొద్దు ప్లీజ్.. పౌరులకు జపాన్ సర్కార్ రిక్వెస్ట్.. ఎందుకో తెలుసా?

ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు జపాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యాషియోలో భూమికుంగడంతో ఒక భారీగుంత ఏర్పడి డ్రైనేజీ పైపు పగిలింది. ఒక ట్రక్కుతో సహా డ్రైవర్‌ అందులో పడిపోయాడు. స్నానం చేయొద్దు, బట్టలు ఉతకొద్దు ప్లీజ్ అని ప్రజలను అధికారులు కోరారు.

New Update
japan

Japan: జపాన్‌లో ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యాషియో(Yashio City, Japan)లో భూమికుంగడంతో ఒక భారీగుంత ఏర్పడి మురుగునీరు పైపు పగిలింది. ఒక ట్రక్కుతో సహా డ్రైవర్‌ అందులో పడిపోయాడు. దీంతో ఎవరు స్నానం చేయొద్దు, బట్టలు ఉతకొద్దు ప్లీజ్ అంటూ అధికారులు రిక్వెస్ట్ చేశారు. 

Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

నీరు చేరితే ప్రాణాలకు ప్రమాదం..

ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. అతన్ని కాపాడేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. మురుగు నీరు కారణంగా గుంత బురదగా మారడంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికంగా ఉండే 12లక్షల మంది ప్రజలను నీరు తక్కువగా వాడాలని అధికారులు కోరారు. మురుగునీరు పైప్‌ పగిలిపోవడంతో మరింత నీరు చేరితే ఆయన ప్రాణాలకు ప్రమాదమని, డ్రైవర్ ను బయటకు తీసేంతవరకు సాధ్యమైనంత తక్కవు నీరు ఉపయోగించాలని, లేదా ప్రత్యామ్నయ మార్గాలు చూడాలని సూచించారు. 

Also Read: Cannibals: ఆకలి తట్టుకోలేక పిల్లలను పీక్కు తింటున్న మనుషులు.. 1300 మందికి పైగా మైనర్లు!

‘ప్రస్తుతం ట్రక్కును బయటకు తీశాం. కానీ క్యాబిన్‌, డ్రైవర్ బయటకు రాలేదు. కొద్దిగంటలుగా 74 ఏళ్ల డ్రైవర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. భూమి వదులుగా ఉండటంతో మెషినరీని ఉపయోగించడం సాధ్యం కావట్లేదు. ఎలాగైనా అతని ప్రాణాలు కాపాడటమే మాకు ముఖ్యం. స్నానం, బట్టలుతకడం వంటి అత్యవసరం కాని పనులకు వాయిదా వేయాలని ప్రజలను కోరుతున్నాం. మిగతా అవసరాలకు కూడా నీటిని తక్కువగా ఉపయోగించాలని సూచించాం. మురుగునీటిని తొలగించేందుకు మరింత సమయం పట్టేలా ఉంది' అని అధికారులు వెల్లడించారు. 

Also Read:  జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు