/rtv/media/media_files/2025/02/15/qxr3uMxnY1JwzFacWWOs.jpg)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections 2025) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరో చిక్కులో పడ్డారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ భవనంలో అవినీతికి పాల్పడి, అక్రమ నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(CVC) దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీలో మాజీ విపక్ష నేత రోహిణి, ఎమ్మెల్యే విజేంద్రగుప్తా ఫిర్యాదు మేరకు సీవీసీ చర్యలకు దిగింది.
Also Read: మద్యం సేవించే మహిళలు ఏ రాష్ట్రంలో ఉన్నారో తెలుసా ?
Big Shock To Arvind Kejriwal
శీష్ మహల్( అద్దాల మేడ, సీఎం అధికారిక నివాసానికి బీజేపీ పెట్టిన పేరు) అంశం ఎన్నికల ముందు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విజేంద్ర గుప్త 2024 అక్టోబర్ 14న సీవీసీకి ఫిర్యాదు చేశారు. 8 ఎకరాల విస్తీర్ణంలో శీష్ మహాల్ నిర్మించేందుకు అరవింద్ కేజ్రీవాల్ భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘించారని ఆయన ఫిర్యాదులో చెప్పారు. ఈ క్రమంలో 2024, అక్టోబర్ 16న సీవీసీ దీనిపై విచారణ ప్రారంభించింది. 2025 ఫిబ్రవరి 13న దీనిపై అందిన నివేదికను పరిశీలించిన తర్వాత.. ఈ అంశంపై మరింత వివరణాత్మక దర్యాప్తు నిర్వహించాలని సంబంధిత ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే తాజాగా సీవీసీ మరోసారి విచారణకు ఆదేశించింది.
Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!
సీఎం అధికారిక నివాసం, దాని పునరుద్ధరణ కోసం జరిగిన వృధా ఖర్చుపై చర్యలు తీసుకోనున్నారు. ఈ నివాసానికి మరమ్మతులు చేపట్టేందుకు కేజ్రీవాల్ రూ.80 కోట్ల ప్రజాధనాన్ని వినియోగించినట్లు బీజేపీ నేత విజేందర్ గుప్తా సీవీసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. శీష్‌మహల్‌లోని టాయిలెట్‌లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్‌పూల్ అలాగే మినీ బార్ వంటివి ఏర్పాట్లు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ బంగ్లాకు మరమ్మతులు చేపట్టడంలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. ఈ క్రమంలోనే సీవీసీ దీనిపై విచారణకు ఆదేశించింది.
Also Read: డేంజర్ జోన్‌లో ఇండియా.. అణబాంబు కంటే 500 రెట్ల వినాశనం!
Also Read : జమ్మూ కాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం