/rtv/media/media_files/2025/05/13/ffj8uFPWwiHcysrIlb0m.jpg)
పాక్, ఇండియా హై టెన్షన్ వాతావరణం కారణంగా ఎయిర్ ఫోర్స్ దాడులు తీవ్రం అవుతున్నాయి. అయితే హైదరాబాద్‌లోని రక్షణ రంగం సంస్థలు హై టెక్నాలజీ, క్యాలిటీ గల మిస్సైల్స్‌ను డెలివరీ చేస్తాయని పేరుంది. హైదరాబాద్‌లో ప్రభుత్వం రంగ సంస్థలతోపాటు ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. తాజా పరిస్థితుల దృశ్యా రక్షణ శాఖ హైదరాబాద్ డిఫెన్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్డర్ చేసిన వెంటనే క్షిపణులు వేగంగా డెలివరీ చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ కోరినట్లు తెలుస్తోంది. ఇదే విషయాలన్ని సోమవారం ఓ ప్రైవేట్ కంపెనీ ప్రమోటర్ చెప్పుకోచ్చారు.
Also Read : కొత్తిమీర కాడల నీటితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
Also Read : ఆన్‌లైన్‌లో అది కొని.. 120 లీటర్ల కల్తీ మద్యం తయారు చేసిన యువత
Defense Department Requests Private And Government Defense
హైదరాబాద్‌లోని ప్రైవేట్, ప్రభుత్వం రక్షణ రంగ సంస్థలు మిస్సైల్స్, ఆయుధాల డెలివరీలను వేగవంతం చేశాయి. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి క్షిపణుల కోసం ఎమర్జెన్సీ ఆర్డర్ వచ్చిందని ఓ కంపెనీ ప్రమోటర్ చెప్పారు. యాంటీ డ్రోన్ టెక్ కంపెనీలు వాటి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. సోమవారం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దేశీయ రక్షణ తయారీదారులను ప్రశంసించారు.
హైదరాబాద్‌లో ప్రభుత్వ రక్షణ సంస్థలు భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉన్నాయి. వీటితోపాటు ప్రైవేట్ సెక్టార్‌లో ఎల్బిట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, కల్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఆస్ట్రా మైక్రోవేవ్, SEC పరిశ్రమలు, MTAR టెక్నాలజీస్, రఘు వంశీ, జెన్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు ఉన్నాయి. భారత్ పాకిస్తాన్‌పై చేసిన దాడుల్లో హైదరాబాద్‌లో వాడిన బ్రహ్మోస్ క్షిపణులుగా గుర్తించారు. దీంతో హైదరాబాద్ బ్రాండ్, లోగో ఉన్న బ్రహ్మోస్ మిస్సైల్స్‌కు మంచి డిమాండ్ పెరిగింది.
Also Read : అది చేయకుంటే కాల్పుల విరమణ ఆగిపోతుంది.. భారత్‌ను హెచ్చరించిన పాక్
Also Read : తండ్రీకొడుకును బలితీసుకున్న ఆన్ లైన్ బెట్టింగ్.. ఒకరికోసం మరొకరు దారుణం!
Defense Department | india | defense-contracts | defence-minister | india pak war | latest-telugu-news | hyderabad