/rtv/media/media_files/2025/05/13/b7jNyEHbQPyzGIVO8fqI.jpg)
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కల్తీ మద్యం తాగి 15 మంది మృతి చెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీ లిక్కర్ వ్యాపారం చేస్తున్న ప్రబ్‌జిత్ సింగ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించగా అసలు నిజం తెలిసింది. ఆ కేసుకు సంబంధించిన విషయాలను ఎస్ఎస్పీ మణిందర్ సింగ్ మీడియాకు వెల్లడించారు. ప్రభ్‌జిత్ సింగ్ ఆన్‌లైన్‌లో సుమారు 50 లీటర్ల ఇథనాల్ కొన్నాడు. ఆ తర్వాత దాంట్లో నీళ్లు కలిపి 120 లీటర్ల కల్తీ మద్యం తయారు చేశాడు. ఈ కేసులో కుల్బీర్ సింగ్, సాహబ్ సింగ్, గుర్జాంత్ సింగ్, నిందర్ కౌర్‌లను అరెస్టు చేశారు.
Also Read : వల్లభనేని వంశీకి బెయిల్!
Also Read : కేటీఆర్ కు పార్టీ పగ్గాలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!
Youth in Punjab Make Adulterated Liquor
#WATCH | Punjab: 14 people dead and 6 hospitalised after allegedly consuming spurious liquor in Amritsar's Majitha
— ANI (@ANI) May 13, 2025
SSP Amritsar Maninder Singh says, " We received information around 9:30 pm last night that here people have started dying after consuming spurious liquor. We took… pic.twitter.com/C7miySsHo6
Also Read : పాక్ ఎయిర్ బేస్‌లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి
సాహెబ్ సింగ్ ఇథనాల్‌ను ఆన్‌లైన్‌లో ప్రొక్యూర్ చేశారని ఎస్ఎస్పీ తెలిపారు. ఆ తర్వాత దాన్ని బస్సులు, కొరియర్ సర్వీసుల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో ఇథనాల్ అమ్ముతున్న కంపెనీలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆయా కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేసినట్లు చెప్పారు.
అమృత్‌సర్ చుట్టు పక్కల గ్రామాల్లో కల్తీ మద్యం తాగిన బాధితులకు ప్రభుత్వం చికిత్స అందిస్తున్నది. కల్తీ సారా తాగి విష లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తున్నారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని అక్కడి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : ముంబై ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు!
adulterated-liquor | panjab cm | police-cases | latest-telugu-news