/rtv/media/media_files/2025/05/13/adIf5pChv4AejDqueGWd.jpg)
Pakistan's Foreign Minister Ishaq Dar has once again issued a threat
భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మరోసారి భారత్‌ను హెచ్చరించారు. సిందూ నది జలాల ఒప్పందం సమస్య పరిష్కారం కాకపోతే కాల్పుల విరమణ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుందని అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ CNNకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు . '' భారత్-పాక్ మధ్య ఉన్న సిందూ నది జలాల ఒప్పందం పరిష్కారం కాకపోతే కాల్పుల విరమమణ అనేది ప్రమాదంలో ఉండొచ్చు. సమస్య పరిష్కారం చూపకపోతే దీన్ని యుద్ధ చర్యగా భావించాల్సి వస్తుందని'' అన్నారు.
Also Read: ఒక్క ఫొటోతో పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన మోదీ..
Also Read : తండ్రీకొడుకును బలితీసుకున్న ఆన్ లైన్ బెట్టింగ్.. ఒకరికోసం మరొకరు దారుణం!
Ishaq Dar Issued A Threat
గతంలో కూడా పాకిస్థాన్ సిందూ జలాల ఒప్పందానికి సంబంధించి హెచ్చరికలు చేసింది. అంతేకాదు చాలామంది పాకిస్థాన్ నాయకులు భారత్‌పై న్యూ్క్లియర్ బాంబు వేస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, POKలో తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది.
ఆ తర్వాత పాక్ మళ్లీ తన దొంగబుద్ధి చూపించింది. భారత్‌పైకి డ్రోన్స్, మిసైల్స్, ఫైటర్ జెట్లతో దాడులు చేశారు. కానీ ఇండియన్ ఆర్మీ వాటిని తిప్పి కొట్టింది. అలాగే పాక్‌లోని వివిధ ప్రాంతాల్లో ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసింది. ఆ తర్వాత భారత్-పాక్ DMGOలు ఫోన్‌లో మాట్లాడుకోవడం వల్ల ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో గత కొన్నిరోజులుగా నెలకొన్న భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. అయినప్పటికీ కూడా భారత్ సరిహద్దుల్లో ఉగ్రదాడులు జరుగుతున్నాయి.
Also Read: పాక్ అణ్వాయుధాలపై దాడి జరిగితే.. ఏమవుతుందో తెలుసా?
దక్షిణ జమ్మూకశ్మీర్‌లోని జిన్‌పథర్ కెల్లర్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మృతి చెందారు. అలాగే మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉంటున్నాయి.
Also Read : ఒక్క ఫొటోతో పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన మోదీ..
telugu-news | rtv-news | national-news | indus water treaty