/rtv/media/media_files/2025/12/24/court-asks-centre-to-cut-air-purifier-gst-temporarily-2025-12-24-15-48-53.jpg)
Court asks Centre to cut air purifier GST temporarily
ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో తీవ్రంగా వాయు కాలుష్యం(Air Pollution) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే దానిపై 18 శాతం జీఎస్టీ ఉండటంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు GST తగ్గించే విషయాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: ఆక్స్‌ఫర్డ్ యూనియన్ డిబేట్..అదరగొట్టిన ఇండియన్ స్టూడెంట్
Delhi High Court Fire On Modi Government
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం(delhi-air-pollution) పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి హైకోర్టులో పలువురు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎయిర్ ప్యూరిఫైయర్లను వైద్య పరికరంగా పరిగిణించాలని పేర్కొన్నారు. వీటిని 5 శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొచ్చేలా కోర్టు కేంద్రానికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలోనే దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మనం రోజుకు 21 వేల సార్లు శ్వాస తీసుకుంటామని చెప్పింది. ఇలాంటి సమయంలో గాలి కాలుష్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందో లెక్కించండని వ్యాఖ్యానించింది.
Also Read: ఆదాయపు పన్ను శాఖ బిగ్ షాక్.. ఐటీ రిఫండ్ అప్లై చేసుకున్నవారికి ఈ మెసేజ్‌లు!
అయితే ఈ పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ప్రభుత్వం అభ్యర్థించగా కోర్టు మండిపడింది. గాలి కాలుష్యం వల్ల వేలాది మంది చనిపోతున్నారని.. ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరమని స్పష్టం చేసింది. దాన్ని అందించలేని పరిస్థితి ఉన్నప్పుడు కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లనైనా అందుబాటు ధరల్లో ఉంచాలి కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక చర్యలు చేపట్టలేరా అంటూ ప్రశ్నించింది. బుధవారమే ప్రభుత్వ స్పందన ఏంటో తెలియజేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది.
Follow Us