/rtv/media/media_files/2025/12/24/fotojet-2025-12-24-15-13-30.jpg)
Oxford Union debate..Indian student who was beaten
ఏ దేశమెగినా..ఎందుకాలిడిన.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవము..అని మనం ఏ దేశంలో ఉన్న మన దేశ ఔన్నత్యాన్ని, కీర్తిని ఎప్పుడు మరిచిపోము. అలాంటిదే ఒక భారతీయ విద్యార్థి(indian-student) ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ(oxford-university) లో చదువుతూ తన దేశ మూలాలను మరిచిపోకుండా దేశ గొప్పతనాన్ని డిబేట్‌లో ప్రస్తావించడం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాక సోషల్ మీడియాలో ఆయన ప్రసంగం వైరల్‌గా మారింది.
You cannot shame a state that has no shame.” That’s the truth about 🇵🇰 Pakistan
— Dharma 🌺🕉 (@DharmaCalling) December 22, 2025
Oxford University student Viraansh Bhanushali shows the mirror to Pakistanis pic.twitter.com/mQ9Q96l5qG
Also Read : ఉస్మాన్ హదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వం !.. బంగ్లాదేశ్‌లో అల్లకల్లోలం
Oxford Union Debate
ఇటీవల ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఆక్స్‌ఫర్డ్ యూనియన్ డిబేట్ (Oxford Union debate) సందర్భంగా ఆయన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ డిబేట్‌లో పాల్గొన్న ముంబయి(mumbai) కి చెందిన భారత విద్యార్థి విరాన్ష్ భానుశాలి మాట్లాడుతూ.. భారత్ పైకి ఉగ్రవాదాన్ని(terrorism) ఎగదోస్తోన్న పాక్‌ను దుమ్ము దులిపాడు. ఆక్స్‌ఫర్డ్ యూనియన్ డిబేట్‌లో పాకిస్థాన్‌కు అనుకూలంగా జరిగిన చర్చలో పాల్గొన్న విరాన్ష్ భారత్ ఎప్పుడూ ఇతర దేశాలను అడ్డం పెట్టుకొని ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని చూడదని ఖరాఖండిగా చెప్పాడు. ముంబయి ఉగ్రదాడి జరిగినప్పుడు భారత ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుందని వివరించాడు.
అయినప్పటికీ నాటి భారత ప్రభుత్వం హింసను ఎంచుకోకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని చూడటం గొప్ప విషయమని వెల్లడించారు. భారత్‌పై ఉగ్రదాడుల సంఘటనల తర్వాత కూడా శాంతియుత పరిష్కారానికే ప్రయత్నించిందని ఆయన పేర్కొన్నారు. అందులోభాగంగానే అంతర్జాతీయ స్థాయిలో చర్చలు చేపట్టారన్నారు.అయినా ఎటువంటి ఉపయోగం లేదని.. మళ్లీ ఉగ్రవాదులు పఠాన్‌కోట్, ఉరి, పుల్వామా, పహల్గాంలలో దాడులకు పాల్పడ్డారని విద్యార్థి ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఉగ్రవాదులను పోషించే అటువంటి సిగ్గుమాలిన దేశంపై జాలి చూపించాల్సిన అవసరం లేదని పాక్ (Pakistan) పై ఘాటు విమర్శలు గుప్పించాడు. కాగా విరాన్ష్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : అమెరికాలో 30 ఇండియన్ డ్రైవర్లు అరెస్ట్
Follow Us