/rtv/media/media_files/2025/12/24/tax-2025-12-24-12-06-31.jpg)
Income Tax Refund
ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం అప్లై చేసుకున్న వారికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. తాజాగా ఆదాయపు పన్ను శాఖ భారీ సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు బల్క్ SMS, ఈమెయిల్స్ పంపింది. టెక్నికల్ ఇష్యూస్ లేదా డాక్యుమెంట్స్ వెరిఫై ప్రక్రియ కారణంగా అనేక రిఫండ్‌లను నిలిపివేసినట్లు అందులో పేర్కొంది. సాధారణంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత, వారం నుండి నెల రోజుల్లోపు రిఫండ్ జమ అవుతుంది. అయితే, ఈసారి వేల సంఖ్యలో రిఫండ్‌లు నిలిచిపోయాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
Also Read: ట్రంప్ కంపు పనులు కవర్ చేస్తూ.. 30,000 పేజీల డాక్యుమెంట్ రిలీజ్
డేటా మిస్ మ్యాచ్: పన్ను చెల్లింపుదారుడు సమర్పించిన ఆదాయ వివరాలకు, ఐటీ శాఖ వద్ద ఉన్న 26AS లేదా AIS డేటాకు మధ్య తేడాలు ఉండటం.
అడిషనల్ వెరిఫికేషన్: మీరు క్లెయిమ్ చేసిన డిడక్షన్లు (80C, 80D వంటివి) సరైనవో కాదో నిర్ధారించుకోవడానికి ఐటీ శాఖ అదనపు ఆధారాలను కోరుతోంది.
Dear CBDT,
— CA Vishnu Agrawal- Former Chairman (ICAI Jaipur) (@cavishnuag) December 23, 2025
Earlier refunds were delayed by officers without application of mind.
Now refunds are delayed by “Risk Management Systems” without application of logic. 🤖
SMS says: “Some discrepancy noted”
No details. No notice. No fault.
But refund? ❌ On hold.
Even simple salary… pic.twitter.com/pVtfe2MCsK
ఐటీ శాఖ పంపిన మెసేజ్ సారాంశం
పన్ను చెల్లింపుదారులకు అందిన సందేశంలో.. "మీ రిఫండ్ ప్రాసెస్ చేయబడింది, కానీ కొన్ని కారణాల వల్ల అది ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది. దయచేసి మీ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను తనిఖీ చేసి, పెండింగ్‌లో ఉన్న ఏవైనా సమాచారానికి సమాధానం ఇవ్వండి" అని పేర్కొన్నారు. ముఖ్యంగా హై-రిస్క్ రీఫండ్‌లుగా గుర్తించిన వాటిని ఐటీ శాఖ ప్రత్యేకంగా తనిఖీ చేస్తోంది.
మీ రిఫండ్ ఆగిపోతే..
మీకు కూడా ఇటువంటి మెసేజ్ వస్తే, వెంటనే ఇలా చేయండి..
పోర్టల్ లాగిన్: ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ (incometax.gov.in)లోకి లాగిన్ అవ్వండి. అక్కడ 'Pending Actions' ట్యాబ్‌కు వెళ్లి 'Worklist' పై క్లిక్ చేయండి. మీకు ఏదైనా నోటీసు లేదా కమ్యూనికేషన్ వచ్చిందో లేదో చెక్ చేయండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పుగా ఉండి రిఫండ్ ఫెయిల్ అయితే, 'Refund Re-issue' రిక్వెస్ట్ పెట్టండి. ఐటీ శాఖ ఏదైనా ఆదాయ వ్యత్యాసంపై ప్రశ్న అడిగితే, తగిన ఆధారాలతో నిర్ణీత గడువులోగా సమాధానం ఇవ్వాలి.
Also Read: జగన్ కు అస్వస్థత.. ఇవాళ్టి పర్యటనలన్నీ రద్దు!
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..
రిఫండ్ ఆలస్యం సాకుతో సైబర్ నేరగాళ్లు నకిలీ లింక్‌లు పంపే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శాఖ ఎప్పుడూ వ్యక్తిగత వివరాలు లేదా పిన్ నంబర్లను అడగదు. కేవలం అధికారిక పోర్టల్ ద్వారానే వివరాలను సరిచూసుకోవాలి. మీ ఐటీ రిటర్న్స్‌లో చిన్న పొరపాట్లు ఉన్నా రిఫండ్ ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి, సకాలంలో స్పందించి మీ రిఫండ్ పొందేలా చూసుకోండి.
Follow Us