/rtv/media/media_files/2025/07/21/congress-student-leader-arrested-in-rape-case-2025-07-21-17-06-41.jpg)
Congress student leader arrested in rape case.. Telangana BJP fires
Crime News: ఒడిశాకు చెందిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థినేత ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. కాగా ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన ఈ ఘటనపై సదరు యువతి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒడిశా యూనిట్ విద్యార్థి నాయకుడు ఉదిత్ ప్రధాన్ తనకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగికదాడికి పాల్పడ్డాడని అందిన ఫిర్యాదు మేరకు భువనేశ్వర్ లోని మంచేశ్వర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత 19 ఏండ్ల యువతి ఈ ఏడాది మార్చిలో తన ఫ్రెండ్స్ తో కలిసి మాస్టర్ క్యాంటీన్ చౌక్ లో ఉన్న సమయంలో ఉదిత్ పరిచయం అయ్యాడు. తనను తాను నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ఒడిశా అధ్యక్షుడిగా పరిచయం చేసుకున్నాడు. అ తర్వాత అంతా కలిసి ఉదిత్ వాహనంలో నయాపల్లిలోని ఒక హోటల్ కు వెళ్లారు. అక్కడ అందరూ మద్యం సేవించగా.. బాధితురాలు మాత్రం మద్యం తాగనని చెప్పడంతో ఉదిత్ ఆమెకు కూల్ డ్రింక్ ఆఫర్ చేశాడు. అది తాగిన ఆమెకు మైకం కమ్మినట్లు అనిపించడంతో ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. కానీ, ఎవరు స్పందించలేదు. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెకు మెలకువ వచ్చాక తనపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించింది. అయితే విషయం బయటకు చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించడంతో భయంతో ఎవరికి చెప్పలేదు. అయితే ఆదివారం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఉదిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : టార్గెట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్.. 'సిద్దిపేట, సిరిసిల్ల'పై రేవంత్ సంచలన నిర్ణయం!
తెలంగాణ బీజేపీ ఫైర్
కాగా,19 ఏళ్ల బాలికపై అత్యాచారం నేపథ్యంలో నిందితుడు ఉదిత్ ప్రధాన్‌ను ఎన్ఎస్‌యూఐ సస్పెండ్ చేసింది. ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో నిందితుడు గతంలో దిగిన ఫోటోను తెలంగాణ బీజేపీ షేర్ చేసింది. ‘ఒడిశాలో 19 ఏళ్ల యువతిని రేప్ చేసిన కాంగ్రెస్ విద్యార్థి నాయకుడు, ఇదేనా ఆడబిడ్డల భద్రత పట్ల కాంగ్రెస్ నిబద్ధత? రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు ఈ అంశంపై స్పందిస్తారా? స్పందించరా? ఆడబిడ్డల భద్రత అనేది కేవలం ఒక నినాదం కాదు.. మహిళల హక్కు’ అని తెలంగాణ బీజేపీ ట్వీట్‌లో ఫైర్ అయింది.
ఇది కూడా చూడండి:Cinema: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే
Also Read : స్కూల్లో డెడ్‌బాడీలు.. చిన్నారుల ప్రాణాలు బలితీసుకున్న చైనా విమానం
crime news today | crime news in telugu | rape | student-union-leaders | Bhubaneswar | odisha