Bangladesh: స్కూల్లో డెడ్‌బాడీలు.. చిన్నారుల ప్రాణాలు బలితీసుకున్న చైనా విమానం

కాలేజీలో క్లాస్‌లు జరుగుతుండగా చైనాకు చెందిన ఎఫ్-7 శిక్షణ జెట్ విమానం కూలిపోయింది. 19 మంది మరణించగా, 70 మంది గాయపడ్డారు. ఢాకా అంతటా 70 మందికి పైగా గాయపడి ఆరు ఆసుపత్రులలో చేరారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం పేలుడు మంటలను ఆర్పారు.

New Update
Bangladesh Air Force

అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరవకముందే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ మాదిరే ఢాకాలో కూడా ఓ కాలేజీ బిల్డింగ్‌పై ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ జెట్ కూలిపోయింది. దీంతో బంగ్లాదేశ్‌లో మంగళవారం రాష్ట్ర సంతాప దినం ప్రకటించారు. కాలేజీలో క్లాస్‌లు జరుగుతుండగా చైనాకు చెందిన ఎఫ్-7 శిక్షణ జెట్ విమానం కూలిపోయింది. 19 మంది మరణించగా, 70 మంది గాయపడ్డారు. ఢాకా అంతటా 70 మందికి పైగా గాయపడి ఆరు ఆసుపత్రులలో చేరారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం పేలుడు మంటలను ఆర్పారు.

Also Read :  ఫహాద్ ఫాజిల్ కీప్యాడ్ ఫోన్ ధర రూ.10లక్షలు.. ఫీచర్లు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

Bangladesh Jet Crashes

Also Read :  కాలిన గాయాలపై టూత్‌పేస్ట్ రాస్తున్నారా..? డాక్టర్ చెప్పే విషయాలు తెలుసుకోండి

చైనాలో తయారైన ఎఫ్-7 జెట్ విమానం ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ భవనంపైకి దూసుకెళ్లింది. తరగతులు జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. చీఫ్ అడ్వైజర్ హెల్త్ స్పెషల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎండీ సయ్యదూర్ రెహమాన్ మాట్లాడుతూ.. 48 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అంబులెన్స్‌లు వెంటనే అందుబాటులో లేకపోవడంతో, ఆర్మీ సిబ్బంది గాయపడిన విద్యార్థులను తమ చేతుల్లో రక్షించి, రిక్షా వ్యాన్‌లు, ఇతర వాహనాల్లో ఆసుపత్రులకు తరలించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బంగ్లాదేశ్ వైమానిక దళం ఈ ప్రమాదానికి గల కారణాన్ని లేదా పైలట్ విమానం నుంచి బయటకు వచ్చాడా లేదా అనే విషయాన్ని ప్రస్తావించలేదు.

Also Read :  MP మిథున్ రెడ్డిని నేలపై పడుకోబెట్టిన జైలు అధికారులు

Also Read :  రేపు టెట్ ఫలితాల విడుదల

bangladesh flight crash | Air Force jet crashes | training aircraft | Chinese F-7 training jet | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు