Warangal: కాకతీయలో పీహెచ్డీ అడ్మిషన్ల వివాదం.. విద్యార్థి సంఘాల నేతలకు గాయాలు
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసకు దారితీసిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల కింద పీహెచ్డీ కేటగిరి-2 అడ్మిషన్లు చేపట్టింది విశ్వవిద్యాలయం. ఈ అడ్మిషన్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అర్హులైన వారికి మాత్రమే అడ్మిషన్లు దక్కేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.