ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ప్రచారాల్లో మునిగిపోయాయి. ఢిల్లీ వాసులకు హామీల వర్షం కురిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే పలు పథకాలు అమలు చేస్తామని ప్రకటిస్తున్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. జీవన్ రక్ష యోజన అనే పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది.
Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్!
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ బుధవారం ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ స్కీమ్‌ను అమలు చేశామని చెప్పారు. ఎలాంటి షరతులు, పరిమితులు లేకుండానే దీన్ని అమలు చేశామని చెప్పారు. ఢిల్లీకి కూడా ఈ ఫథకం ఓ గేమ్‌ఛేంజర్ అవుతుందని తెలిపారు. మరోవైపు 'ప్యారీ దీదీ యోజన' అనే పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2500 ఇస్తామని హస్తం పార్టీ ఇప్పటికే ప్రకటించింది.
Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బీజీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు విడుదల కానున్నాయి. లిక్కర్ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యాక తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సీఎం జైలుకి వెళ్లి రావడంతో ఈసారి ఢిల్లీ ఎన్నికలు దేశం దష్టిని మరింత ఆకర్షిస్తున్నాయి. ఈసారి ఢిల్లీ ప్రజలు ఏ పార్టీకి అధికారం ఇస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు!
Also Read: అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు