Latest News In Telugu Rajasthan Politics:ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో అందరికీ తెలుసు-అశోక్ గహ్లోట్ రాజస్థాన్ లో ఉన్నట్టుండి కాంగ్రెస్ నేతల ఇళ్ళల్లో దాడులు ఎందుకు జరుగుతున్నాయో దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. రైతులు, మహిళలు అభివృద్ధి చెందడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని...అందుకే ఇప్పటి నుంచే కాంగ్రెస్ కు అడ్డుకట్ట వేస్తోందని ఆయన ఆరోపించారు. By Manogna alamuru 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ashok Gehlot: ముఖ్యమంత్రి పదవిపై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.. వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తన పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే దేవుని దయతో.. తనను నాలుగోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నానని ఓ మహిళ తనతో చెప్పినట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టాలని అనుకున్నప్పటికీ కూడా.. ఆ పదవి తనని విడిచిపెట్టడం లేదని ఆమె తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. By B Aravind 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajasthan MLA: ముఖ్యమంత్రికి వెంట్రుకలు పంపిన సొంత పార్టీ ఎమ్మెల్యే! సమస్యల గురించి సీఎంకి విన్నవించినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి పరిష్కారాలు దొరకక పోవడంతో ఆయన వినూత్న పద్దతిలో సీఎంకి నిరసన వ్యక్తం చేశారు. ఆయన గుండు చేయించుకుని ఆ వెంట్రుకలను ముఖ్యమంత్రికి పంపించారు. దాంతో పాటు ఓ లేఖ కూడా ఆయన సీఎంకి పంపారు. By Bhavana 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఏ మాత్రం సిగ్గున్నా సీఎం పదవికి రాజీనామా చేయాలి.... సీఎం గెహ్లాట్ పై అమిత్ షా ఫైర్....! రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రెడ్ డైరీ విషయంలో సీఎం పదవికి ఆశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలన్నారు. రెడ్ డైరీని చూసి గెహ్లాట్ భయపడుతున్నారని ఆయన అన్నారు. అసలు రెడ్ డైరీ గురించి సీఎం అశోక్ గెహ్లాట్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని పేర్కొన్నారు. By G Ramu 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ashok Gehlot : కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సీరియస్.. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు గహ్లోట్ క్లాస్ రాజస్థాన్ లోని కోటాలో ఈమధ్యకాలంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం కోచింగ్ సెంటర్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వారికి క్లాస్ పీకారు. ఆత్మహత్యలను అరికట్టేందుకు కమిటీ వేయాలని సీఎం గెహ్లాట్ అధికారులను ఆదేశించారు. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajasthan Elections: సగం పైగా స్థానాల్లో కొత్త వాళ్లు, బీజేపీ, కాంగ్రెస్ లది అదే స్ట్రాటజీ రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు మొదలు పెట్టింది. దాదాపు 45మంది నాయకులకు టిక్కెట్ నిరాకరించింది. పార్టీలో కొత్త జోష్ నింపడంతోపాటు కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు బీజేపీ, కాంగ్రెస్ రెండూ పార్టీలు కూడా కొత్త ముఖాలను పోటీకి దింపుతున్నాయి. బీజేపీ 45 మంది పాత ముఖాలను పక్కనపెడితే...కాంగ్రెస్ 50 మంది కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చింది. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకే స్ట్రాటజీ కనబరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. By Bhoomi 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహిళలను వేధిస్తే ఇక ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు... ప్రభుత్వం కీలక నిర్ణయం....! మహిళలపై నేరాలను అదుపు చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలను వేధింవులకు గురి చేసే వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల ప్రకటించనున్నట్టు పేర్కొంది. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని సీఎం అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. By G Ramu 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn