Honey Rose: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త

మలయాళ నటి హనీ రోజ్‌ సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న వేధింపులపై పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు. ఈకేసులో ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ సిట్‌ అధికారులు  అదుపులోకి తీసుకున్నారు.

New Update
honey rose files complaint

honey rose

మలయాళ నటి హనీ రోజ్‌ సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న వేధింపులపై పోలీసులను ఆశ్రయించారు. సుమారు 27 మందిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఎర్నాకుళం పోలీసులు ఆ 27 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ అతన్ని సిట్‌ అధికారులు  అదుపులోకి తీసుకున్నారు. అతడిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదే విషయంపై హనీ రోజ్‌ స్పందిస్తూ.. "ఈ చర్యలతో నాకు కొంత ప్రశాంతత లభించింది. ఈ కేసు విషయాన్ని నేను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గారి దృష్టికి తీసుకువెళ్లాను. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న హామీ ఇచ్చారు." అని పేర్కొన్నారు.

Also Read : 'పుష్ప' చీటింగ్.. మూవీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్

ఇటీవల ఒక వ్యాపారవేత్త తనను ఇబ్బంది పెడుతున్నట్లు హనీ రోజ్ నటి వెల్లడించారు.' ఒక వ్యక్తి కావాలనే నన్ను అవమానించడానికి ప్రయత్నిస్తున్నాడు. గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించగా, వ్యక్తిగత కారణాల వల్ల వాటికి హాజరుకాలేకపోయాను. ఆ కారణంగా, ప్రతీకారభావంతో నేను హాజరయ్యే ప్రతి కార్యక్రమంలో భాగస్వామి అవుతూ, నన్ను కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు..' దీనిపైనే తాను పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు.

' సహజంగా నేను విమర్శలను, సరదా జోక్స్‌, మీమ్స్‌ను పెద్దగా పట్టించుకోను. కానీ, అవన్నీ ఒక హద్దు లోపల ఉండాలని నేను నమ్ముతాను. అసభ్యకరమైన వ్యాఖ్యలు ఏమాత్రం సహించను. అందుకే, ఈ సమస్యకు చట్టపరమైన పరిష్కారం కోరాను..' అని ఆమె స్పష్టం చేశారు. 

Also Read : 'రాజాసాబ్' పై అంచనాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్.. థమన్ షాకింగ్ కామెంట్స్

కాగా పలు మలయాళ సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హనీ రోజ్.. బాలయ్య నటించిన 'వీరసింహారెడ్డి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినిమాలో బాలయ్య భార్యగా నటించి మెప్పించారు. 2023 లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

Advertisment
తాజా కథనాలు