Sankranti 2025: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు!

సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లేవారికి పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. దొంగల నుంచి ఇళ్లను కాపాడుకోవడానికి సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో సరిగ్గా చెక్ చేసుకోవాలని. ఇంట్లోని నగదు, బంగారాన్ని బ్యాంక్ లాకర్‌లో ఉంచడం మంచిదని సూచించారు.

author-image
By Archana
New Update
Sankranti 2025

Sankranti 2025

Sankranti 2025:  సంక్రాంతి పండగ రాగానే అందరూ సొంతూళ్ల బాట పడతారు.  ఇళ్లకు తాళాలు వేసి భార్య, పిల్లలతో సోతూళ్ళకు వెళతారు. సిటీలోని రోడ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రదేశాలు ఖాళీగా దర్శనమిస్తాయి. పలు ఏరియాలు ఇళ్ళన్ని తాళాలు వేసి, జనాలు లేకుండా నిర్మానుష్యంగా కనిపిస్తాయి. ఇక ఇదే అదనుగా భావించే దొంగలు రెచ్చిపోతారు. దొరికిందే సందని ఇంటిని గుల్ల చేస్తున్నారు. పక్కాగా రెక్కీ చేసి.. రాత్రికి రాత్రి ఇంటిని దోచేస్తారు. 

అయితే పండగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్ళే వారికి  తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. దొంగలు నుంచి తాళం వేసిన మీ  ఇంటిని  కాపాడుకోవడానికి  కొన్ని జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి తెలిపారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పోలీసుల 7 జాగ్రత్తలు..  

  • ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు కనపడే విధంగా గేటుకు, మెయిన్ డోర్ కి తాళం వేయకూడదు. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి.. పక్క డోర్లకు తాళం వేయడం మంచిది. దీని వల్ల ఇంట్లో మనుషులు ఉన్నారని అనుకుంటారు. 
  • ఇంటికి, ఇంటి గేటుకు తాళం వేసి ఎప్పుడూ  కూడా దూర ప్రాంతాలకు వెళ్ళవద్దు. ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. మీ ఇంటి దగ్గర తెలిసిన బంధువులు, స్నేహితులు పడుకునేలా ఏర్పాట్లు  చేయండి. 
  • ఊరు వెళ్లేముందు ఇంట్లో బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బీరువాలో అస్సలు పెట్టకూడదు. బ్యాక్ లాకర్లలో దాచుకోవడం మంచిది. 
  • ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం అందించడం మంచిది.  పోలీసులకు చెప్పడం ద్వారా రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఇంటి పై  ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. 
  • నైట్ టైం ఏదైనా ఒక రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉండేలా ఆన్ చేసి ఉంచాలి. 
  • అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 100 కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. 
  • మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేలా.. ఇంటికి సీసీ కెమెరా అమర్చుకోవాలి. ఇంటి బయట నాలుగు దిక్కులు కవర్ అయ్యేలా కెమెరాలు పెట్టాలి. 
     ప్రతి ఒక్కరు ఈ సూచనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

Also Read: Game Changer: చరణ్, బాలయ్యకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్.. టికెట్ ధరల పెంపుకు బ్రేక్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు