దేశ వ్యాప్తంగా బీర్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అందులో కింగ్ ఫిషర్ బీర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అత్యధిక మంది ఈ బీర్లనే ఎంచుకుంటారు. టేస్టీ పరంగా కూడా ఈ కింగ్ ఫిషర్ బీరే కింగ్‌లా పనిచేస్తుందని భావించి తెగ తాగేస్తుంటారు. అందుకే ఎప్పటికప్పుడు ఈ బీర్లకి కొరత ఉంటుంది.
Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్!
ఇక వేసవి కాలం వచ్చిందంటే.. ఈ కంపెనీ బీర్లు దొరకడం చాలా కష్టమనే చెప్పాలి. మండే ఎండకి.. అలా చిల్డ్ బీర్ వేస్తే ఆ కిక్కే వేరు అన్నట్లు ఫీలవుతుంటారు. ఇక అందులోనూ కింగ్ ఫిషర్ అయితే అబ్బో రచ్చ రచ్చే. దీంతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బీర్‌గా కింగ్ ఫిషరేకు మంచి పేరు వచ్చింది.
అయితే ఇప్పుడు ఈ బీర్ తెలంగాణలో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అవును ఇది వినడానికి కొంచెం కష్టమే అయినా.. తెలంగాణలో మందు బాబులకు ఇదొక షాకింగ్ విషయమే అని చెప్పాలి. ఈ మేరకు కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త
బాబులకు బిగ్ షాక్
తెలంగాణలో మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. కింగ్ ఫిషర్ బీర్ల తయారీ కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ బేవరేజస్‌కు కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాల సరఫరాను నిలిపివేయాలని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటన విడుదల చేసింది.
కారణం ఇదే
Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో ఈ కంపెనీ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటించింది. సాధారణంగా బేవరేజెస్ కార్పొరేషన్ (యూబీ) గ్రూప్‌కు ప్రతి 45 రోజులకి ఒకసారి బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికి నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడం సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు లేఖలో పేర్కొంది. 2019-20 నుంచి బీర్ల ధరలను సవరించకపోవడంతో భారీ నష్టాలు వస్తున్నాయని యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ తెలిపింది.
Important Update for Beer Lovers in #Telangana: United Breweries said on Wednesday that it has suspended supplying beer to Telangana Beverages Corporation Limited (TGBCL), which will halt sales of popular beer brands such as Heineken and Kingfisher.#beer #Telangana #kingfisher… pic.twitter.com/7Az7zXNK8L
— Deccan Chronicle (@DeccanChronicle) January 8, 2025
సంక్రాంతి సమయంలోనే
సంక్రాంతి పండుగకు మరికొద్ది రోజులే సమయం ఉంది. బోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ.. ఇలా ఈ నాలుగైదు రోజులు వైన్‌షాపులు ఖాళీగా ఉండవు. ఎక్కడ చూసినా షాపులు కిక్కిరిసిపోతాయి. ఈ పండుగ రోజులు చుక్క, ముక్కతో మందు బాబులు రచ్చ రచ్చ చేస్తుంటారు. అలాంటి సమయంలో అత్యధికమంది తాగే బీర్ కూడా కింగ్ ఫిషరే. మరి ఇలాంటప్పుడు ఈ బీర్లు లేవనే వార్త తెలిసి మందుబాబు తెగ ఫీలైపోతున్నారు. ఓన్లీ ఈ ఒక్క కంపెనీ బీర్ తాగేవారైతే.. ఇంత పని జరిగిందేంట్రా అని తెగ గింజుకుంటున్నారు. చూడాలి మరి ఈ పండుగ రోజుల్లో అందుబాటులోకి వస్తాయో లేదో