Congress Leader: కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడా వ్యాఖ్యలను తిప్పి కొట్టిన కేంద్ర విద్యాశాఖ!

ఐఐటీ రాంచీ విద్యార్థులతో వర్చువల్‌ గా ప్రసంగిస్తున్నప్పుడు ఆ కాన్ఫరెన్స్‌ని హ్యాక్ చేసి పోర్న్ వీడియో ప్రదర్శించారని కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ ఘాటుగా స్పందించింది.

New Update
syam pitroda

syam pitroda

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా షాకింగ్‌ కామెంట్లు చేశారు. ఐఐటీ రాంచీ విద్యార్థులను ఉద్దేశించి తాను వర్చువల్‌గా ప్రసంగిస్తున్న సమయంలో హ్యాక్ చేసి పోర్న్ వీడియో ప్రదర్శించారని తీవ్ర ఆరోపణల చేశారు. వంద మంది విద్యార్థులతో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగిందని.. అకస్మాత్తుగా ఎవరో హ్యాక్ చేసి అశ్లీల కంటెంట్‌ను చూపించారన్నారు. 

Also Read:  Viral News: భార్యకు నచ్చలేదని 27లక్షల రూపాయల కారుని చెత్త కుప్పలో పడేసిన భర్త!

రాంచీ అనేదే ఉనికిలో లేదని.....

వెంటనే ఆపేయడం తప్ప మాకు వేరే మార్గం కనిపించలేదన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది న్యాయమా?, దేశంలో ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లే ఈ అంతరాయం ఏర్పడిందని పిట్రోడా ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌ వేదికగా ఆయన ఆరోపణలు చేశారు .పిట్రోడా ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ ఘాటుగా స్పందించింది. అసలు ఐఐటీ రాంచీ అనేదే ఉనికిలో లేదని.. అలాంటిది హ్యాక్ చేయడం ఎలా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేసింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం మానుకోవాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

Also Read: Telangana: విజయ డెయిరీ పాలు వాడేవారికి అలర్ట్.. చైర్మన్ షాకింగ్ ప్రకటన!

అయినా పిట్రోడాకు భౌతికంగా లేదా వర్చువల్‌గా ఉపన్యాసం చేయడానికి ఇన్‌స్టిట్యూట్ ఏ కాన్ఫరెన్స్/సెమినార్‌కు ఆహ్వానించలేదని ఐఐఐటీ రాంచీ ధృవీకరించిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఐటీల ఖ్యాతి అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తల కృషి, సాధనపై నిర్మించడం జరిగిందని వివరించింది. ప్రముఖ సంస్థలను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

Also Read: Pak-Ind: మీరు చెబితే వినే స్టేజ్ లో మేము లేము..పాక్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్‌!

Also Read: Actress Priyamani: ఛీ మీరు మనుషులేనా అసలు..పుట్టే పిల్లల గురించి కూడా అలాంటి కామెంట్లా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు