ఏడుసార్లు ట్రాఫిల్‌ రూల్స్‌ ఉల్లంఘించిన సీఎం కారు.. డిస్కౌంట్‌తో జరిమానా చెల్లింపు

కర్ణాటక ప్రభుత్వం ఇటీవల 50 శాతం డిస్కౌంట్‌తో చలనా రాయితీ స్కీమ్‌ను ప్రకటించింది.కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రయాణించే కారుపై కూడా చలానాలు ఉన్నాయి. దీంతో ఈ స్కీమ్‌తో ఉన్న 50 శాతం డిస్కౌంట్‌తో జరిమానాలు కట్టేశారు.

New Update
CM Siddaramaiah's official car booked for 7 traffic violations

CM Siddaramaiah's official car booked for 7 traffic violations

కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ట్రాఫిక్ చలానాలపై వాహనదారులకు ఊరట కల్పించిన సంగతి తెలిసిందే. ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌తో స్కీమ్‌ను ప్రకటించింది. వీటికి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రయాణించే కారుపై కూడా చలానాలు ఉన్నాయి. దీంతో ఈ స్కీమ్‌తో ఉన్న 50 శాతం డిస్కౌంట్‌తో జరిమానాలు కట్టేశారు. అయితే సిద్ధరామయ్య ప్రయాణించే కారు ట్రాఫిక్‌లో ఏడుసార్లు ఉల్లంఘనలకు పాల్పడింది. 

Also Read: ఏకంగా ఎర్రకోటపైనే కన్నేసిన దొంగలు.. విలువ చేసే కలశం మాయం.. ఎన్ని కోట్లంటే?

Also Read: గొప్ప ప్రధాని అనడాన్ని అభినందిస్తున్నా..ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందన

వీటిలో కారు సీటుబెల్ట్‌ ధరించనందుకే ఆరుసార్లు చలానా పడింది. అలాగే అతివేగంతో వెళ్లినందుకు ఒకసారి జరిమానా విధించారు. ముఖ్యమంత్రి కారుకు ఉన్న చలానాలు చెల్లించలేదని ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే సీఎం యంత్రాంగం డిస్కౌంట్‌ స్కీమ్‌ ద్వారా చెల్లించింది. ఈ చలానాలకు రాయితీ పోగా మొత్తం రూ.8750 చెల్లించింది.  

Also Read: పాకిస్తాన్ కరాచీలో ఘనంగా గణేష్ నిమజ్జనాలు.. గణపతి విగ్రహాలతో కళకళలాడుతున్న వీధులు!

చలానా రాయితీ స్కీమ్‌ కింద వాహనాదారులు సగం కడితే మిగతా మొత్తాన్ని కర్ణాటక ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 21 ఈ పథకాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 19 వరకు మాత్రమే ఇది అమల్లో ఉండనుంది. ఈ రాయితీ స్కీమ్‌ తీసుకురావడం వల్ల ఇప్పటిదాకా వాహనాదారుల నుంచి రూ.40 కోట్లు వసూలైనట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. 

Also Read: గణపతి నిమజ్జనం రోజు వర్షం పడటం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో మీకు తెలుసా?

Advertisment
తాజా కథనాలు