/rtv/media/media_files/2025/09/06/delhi-red-fort-2025-09-06-13-39-49.jpg)
Delhi red fort
ఢిల్లీలోని ఎర్రకోటలో భారీ దొంగతనం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఎర్రకోట పార్కులో జైన మత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత ఓ ప్రత్యేకమైన కలశం కనిపించడం లేదు. దొంగతనం జరిగినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ వ్యాపారవేత్త అయిన సుధీర్ జైన్ డైలీ పూజ నిర్వహించడం కోసం ఓ ప్రత్యేకమైన కలశాన్ని తీసుకొచ్చేవారు. ఈ కలశ పూజ ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు కొనసాగుతాయి. దీంతో దొంగలు పక్కా ప్లానింగ్‌తో ఈ విలువైన కలశాన్ని కొట్టేశారు.
🚨 BIG SECURITY LAPSE 🚨
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 6, 2025
A gold & diamond-encrusted kalash worth crores STOLEN from Delhi’s Red Fort during a Jain religious event.
— Police & CISF have launched a probe and are reviewing CCTV footage. pic.twitter.com/Hv2BrNCb9N
విలువైన కలశం మాయం..
ఎర్రకోట వద్ద దగ్గర ఉన్న భద్రత సిబ్బందిని బురిడి కొట్టించి మరి దొంగతనం చేశారు. ఈ కలశం మొత్తం బంగారం, వెండితో తయారు చేసినది. ఈ కలశంలో 760 గ్రాముల బంగారం, 150 గ్రాముల వజ్రాలు, మాణిక్యాలు, పచ్చలు పొదిగి ఉన్నాయని తెలుస్తోంది. ఇంత విలువైన కలశం దొంగతనం జరగడంతో ఎర్రకోట వద్ద ఉన్న భద్రతా లోపం ఎలా ఉందో తెలుస్తోంది. వారి నిర్లక్ష్యం వల్లనే ఈ దొంగతనం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే దుండగుడిని పట్టుకుంటామని తెలిపారు.
ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!
ఇదిలా ఉండగా ఆగస్టు 2న కూడా ఎర్రకోటలో భద్రతా లోపం ఏర్పడింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పోలీసులు ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్‌లో స్పెషల్ సెల్ బృందం సాధారణ దుస్తుల్లో వచ్చి వారితో ఒక నకిలీ బాంబును ఎర్రకోటలోకి తీసుకెళ్లారు. ఆ బాంబును భద్రతా సిబ్బంది అసలు గుర్తించలేదు. కొందరి నిర్లక్ష్యం కారణంగా జరగడంతో కొంతమంది పోలీసులను సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ భారీ దొంగతనం జరగడంతో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది.