PM Modi: గొప్ప ప్రధాని అనడాన్ని అభినందిస్తున్నా..ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందన

తనను గొప్ప ప్రధాని అన్నందుకు, మంచి స్నేహితిడిగా భావించినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందిస్తున్నా అన్నారు భారత ప్రధాని మోదీ. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. 

New Update
usa

PM Modi, USA President Trump

ప్రస్తుతం భారత్, అమెరికాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఒకరోజు భారత్ తమకు శత్రువువ అంటున్నారు. వారిపై ఇంకా టారిఫ లమోత అయిపోలేదని చెబుతున్నారు. మరోవైపు భారత ప్రధాని తనకు మంచి స్నేహితుడని, గొప్ప ప్రధాని అని పొగుడుతున్నారు. తాజాగా  భారత్ పై సుంకాల గురించి మాట్లాడుతూ..మేమేమీ కావాలని అలా చేయలేదు. భారతదేశం రష్యా నుండి ఇంత ఎక్కువ చమురు కొనుగోలు చేయడం చూసి నేను చాలా నిరాశ చెందాను.  అదే విషయాన్ని భారత్ కు చెప్పాము . కానీ వారు పట్టించుకోలేదు. అందుకే సుంకాలు విధించాల్పి వచ్చిందని చెప్పుకొచ్చారు. అవును నిజమే ఆ దేశంపై చాలా ఎక్కువ సుంకమే విధించానని అన్నారు. నిజానికి భారత ప్రధాని మోదీతో నేను చాలా బాగా కలిసిపోయాను. ఆయనో గొప్ప ప్రధాని రెండు నెలల క్రితం ఆయన వచ్చినప్పుడు కూడా బాగా మాట్లాడుకున్నాము అని ట్రంప్ అన్నారు. 

అమెరికాతో మంచి భవిష్యత్తు..

దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. తనను గొప్ప ప్రధాని అనడాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని స్వాగతిస్తున్నామని మోదీ అన్నారు. భారత్, అమెరికా ఎప్పుడూ మంచి స్నేహితులే అని..ఇరు దేశాల మధ్య మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగే ఉన్నాయని ప్రధాని చెప్పారు. 

Also Read: Mumbai: గణేష్ నిమజ్జనానికి ఆర్డీఎక్స్ బాంబు బెదిరింపు..నోయిడాలో నిందితుడు అరెస్ట్

Advertisment
తాజా కథనాలు