Ganesh Nimajjanam Karachi Pakistan: పాకిస్తాన్ కరాచీలో ఘనంగా గణేష్ నిమజ్జనాలు.. గణపతి విగ్రహాలతో కళకళలాడుతున్న వీధులు!

భారత్‌లోనే కాకుండా పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. హిందువులు సంప్రదాయ దుస్తులు ధరించి డోలు శబ్దాలకు నృత్యాలు చేస్తున్నారు. 'గణపతి బప్పా మోరియా' అని నినాదాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్న వీడియో వైరల్ అవుతోంది.

New Update
Ganesh Nimajjanam karachi pakistan

Ganesh Nimajjanam karachi pakistan

దేశంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు(Ganesh Immerssion) ఘనంగా జరుగుతున్నాయి. అయితే భారత్‌(India) లోనే కాకుండా పాకిస్తాన్‌(Pakistan) లోని కరాచీ నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పాక్‌లో ఉన్న హిందువులు తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి నేడు నిమజ్జనం నిర్వహిస్తున్నారు. నిమజ్జనం కోసం పెద్దగా ఊరేగింపు నిర్వహించారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్‌లో గణపతి విగ్రహాన్ని ఒక ఆటోలో పెట్టి వీధుల నుంచి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!

డ్యాన్స్‌లు వేస్తూ..

హిందువులు సంప్రదాయ దుస్తులు ధరించి డోలు శబ్దాలకు నృత్యాలు చేస్తున్నారు. 'గణపతి బప్పా మోరియా' అని నినాదాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. వీరిని అక్కడ ఉన్న ముస్లింలు ఆశ్చర్యంతో చూస్తున్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఎంతో ఘనంగా పాక్‌లోకి కరాచీలో ఈ ఊరేగింపు నిర్వహించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఇది కదా అసలైన ధర్మం అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. భారత్‌, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది వినాయక చవితిని ఇలా నిర్వహించడంతో పలువురు ప్రశంసిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు