/rtv/media/media_files/2025/07/08/meghalaya-police-2025-07-08-09-59-06.jpg)
Meghalaya police custodial assault
పోలీసులు దారుణంగా ప్రవర్తించిన సంఘటనలు తరుచుగా కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటిదే మరో సఘటన వెలుగులోకి వచ్చింది.మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా పోలీస్ స్టేషన్లో పోలీసులు ఓ 19 ఏళ్ళ యువకుడితో దారుణంగా ప్రవర్తించారని తెలుస్తోంది. తమ అదుపులో ఉన్న గెట్ విన్ అనే యువకుడిని మానసికంగా, శారీరకంగా హింసించారు. అక్కడితో ఆగకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్న టాయిలెట్ లో నీళ్ళు తాగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై అధికారికంగా విచారణ ప్రారంభమైంది. బాధితుడు గెట్‌విన్ తల్లి మిల్డ్రెడ్ జైర్వా, జిల్లాకు చెందిన ఎస్పీ వివేక్ సియెంకు ఫిర్యాదు చేశారు.
చిన్న గొడవకే థర్డ్ డిగ్రీ..
జూలై 3న ఓ యువకుడితో జరిగిన గొడవ కారణంగా గెట్ విన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తానే స్వయంగా తన కుమారుడిని ఉదయం 9 గంటల సమయంలో సోహ్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లానని గెట్ విన్ తల్లి మిల్డ్రెడ్ జైర్వా తెలిపారు. దాని తరువాత అతను మధ్యాహ్నం 2 గంటల సమయంలో తీవ్ర గాయాలతో బయటకు వచ్చారని చెప్పారు. వెంటనే గెట్ విన్ ను సోహ్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి శిలాంగ్ సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉన్నాడని అతని తల్లి చెప్పారు. తన కుమారుడు తప్పు చేసినా..పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం ఇది కాదని ఆమె ఆరోపించారు. న్యాయప్రకారం వారు ప్రవర్తించలేదని అన్నారు. అతనిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన అని అన్నారు. తప్పు చేసిన వారిపై తిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.
Also Read: USA: ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయండి..ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు