Lord Ram: శ్రీ రాముడు నేపాల్‌లో జన్మించాడు.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించాడని అన్నారు. సోమవారం కాఠ్మాండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఓలి ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Lord Ram

Nepal PM KP Oli Repeats Claims 'Lord Ram Was Born In Nepal, Not India'

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించాడని అన్నారు. సోమవారం కాఠ్మాండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఓలి ఈ వ్యాఖ్యలు చేశారు. '' రాముడు నేపాల్‌లోనే జన్మించాడు. వాల్మీకి రాసి రామాణయం ఆధారంగానే నేను ఈ విషయం చెబుతున్నాను. దీన్ని ప్రచారం చేసేందుకు నేపాల్ ప్రజలు సంకోచించాల్సిన అవసరం లేదు. రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలు సృష్టిస్తారా ?.

Also read: నితీశ్‌ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌

'Lord Ram Was Born In Nepal

రాముడు పుట్టిన స్థలం ఇప్పటికీ నేపాల్‌లోనే ఉంది. కానీ దీన్ని మనం అంతగా ప్రచారం చేయలేకపోతున్నాం. ఇది కొందరిని బాధిస్తుందని నేను భావిస్తున్నాను. అంతేకాదు శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్‌లోనే జన్మించారు. నేను ఇది సొంతంగా చెప్పడం లేదు. వాల్మీకి రాసిన రామాయణంలో ఇది కూడా ఉందని'' ఓలి అన్నారు. 

Also Read: పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ.. అసీమ్ మునీర్‌ తిరుగుబాటు

ఇదిలాఉండగా.. గతంలో కూడా ప్రదాని ఓలి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. అయోధ్య నేపాల్‌లోని చిత్వాన్‌లోని థోరి అనే ప్రాంతంలో ఉందని 2020లో చెప్పారు. రాముడు ఇక్కడే పుట్టాడని అన్నారు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన ప్రాంతం కూడా నేపాల్‌లోనే ఉందని తెలిపారు. ఓలి చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆ సమయంలో నేపాల్‌ విదేశాంగ శాఖ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి ప్రదాని ఈ వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంది. రాముడి పుట్టిన స్థలంపై విభిన్న అభిప్రాయాలున్నాయని.. రామాయణంపై విస్తృతమైన అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని మాత్రమే ఆయన చెప్పినట్లు స్పష్టం చేసింది.  

Also Read: ఛీ.. నువ్వు ఒక తండ్రివేనా? కన్నబిడ్డను తల్లిని చేసిన కసాయి తండ్రి

Also Read: Elon Musk : ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడ..పార్టీలో భారతీయుడికి కీలక పదవి

telugu-news | rtv-news | nepal | lord-rama

Advertisment
Advertisment
తాజా కథనాలు