భారత్- చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతునే ఉన్నాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇటీవలే ఇరుదేశాలు కీలక ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలు మరింత బలపర్చేందుకు చైనా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ పౌరులకు వీసా ధరలపై తగ్గింపును మరో ఏడాది వరకు పొడిగించింది. భారత్‌లోని చైనా దౌత్య కార్యాలయం తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. Also Read: కొత్త సంవత్సరం మొదటి రోజే..తల్లి,నలుగురు చెల్లెళ్లను చంపేసిన కిరాతకుడు! వీసా ఫీజుల తగ్గింపు గడువు 2025 డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని తెలిపింది. చైనాలో పర్యటించాలనుకునే విదేశీయుల ప్రయాణ విధానాలను రెగ్యులరైజ్ చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఎంబసీ కార్యాలయం పేర్కొంది. వాస్తవానికి గత ఏడాదే ఈ వీసా ధరలు తగ్గించారు. సింగిల్ ఎంట్రీ వీసాలకు రూ.2900, డబుల్ ఎంట్రీ వీసాలకు రూ.4,400 వసూలు చేస్తున్నారు. ఆరు నెలల వరకు గడువు ఉండే మల్టిపుల్ ఎంట్రీ వీసాలకు రూ.5,900, ఏడాది అంతకంటే ఎక్కువ గడువు ఉండే మల్టీ ఎంట్రీ వీసాలకు రూ.8,800 చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది నుంచి ఇవే ధరలు కొనసాగతున్నాయి. ఈ ధరలను మరో ఏడాదికి చైనా పొడిగించడంతో పర్యాటక ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Also Read: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి! ఇదిలాఉండగా.. వాస్తవాధీన రేఖ ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు భారత్, చైనా ఇటీవల గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంట కొనసాగనుంది. అలాగే ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇకనుంచి స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పట్లో భారత రక్షణ శాఖ కూడా దీనిపై స్పందించింది. పరస్పర భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. చైనాతో పలుమార్లు దౌత్యపరమైన చర్చలు జరిగిన తర్వాత ఈ ఒప్పందం జరిగినట్లు తెలిపింది. Also Read: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి!