/rtv/media/media_files/2025/02/27/cMQT2YEaj7z3amHU5HCZ.jpg)
Neelam Shinde
అమెరికా (America) లో రోడ్డు ప్రమాదానికి (Road Accident) గురై కోమాలో ఉన్న భారతీయ విద్యార్థిని కుటుంబానికి సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. బాధితురాలి కుటుంబ ఆవేదన తమ దృష్టికి రావడంతో అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు నీలమ్ శిండే (35) అనే విద్యార్థిని కాలిఫోర్నియా యూనివర్శిటీలోని పీజీ చేస్తోంది. అయితే ఫిబ్రవరి 14న ఆమె రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు ఢీకోనడంతో ఆమె తల, ఛాతి భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె కోమాలో ఉంది.
Also Read: హిందీ వల్ల 25 నార్త్ ఇండియా భాషలు నాశనమయ్యాయి: స్టాలిన్
ఫిబ్రవరి 16న నీలమ్ శిండే కుటుంబానికి ఈ విషయం తెలిసింది. దీంతో ఆమె తండ్రి వెంటనే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. వీసా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అయితే ఎన్‌సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే సోషల్ మీడియాలో ఆమె కుటుంబం గురించి పోస్టు చేసింది.
Also Read : ఆ పాట పాడినందుకు సిగ్గుగా ఉంది! కత్రినా పాటపై శ్రేయా ఘోషల్ హాట్ కామెంట్స్
Emergency VISA For Indian Student
Student Neelam Shinde has met with an accident in the USA and is hospitalized in a local hospital. Her father, Tanaji Shinde, from Satara, Maharashtra, India, urgently needs to visit his daughter due to a medical emergency. Tanaji Shinde has applied for an urgent visa to the USA…
— Supriya Sule (@supriya_sule) February 26, 2025
Also Read: ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చార్రా బాబు.. సూటు బూటు వేసుకొని ఇవేం చేష్టలు..
'' నీలమ్ శిండే అనే విద్యార్థిని అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం కూతురు వద్దకు వెళ్లేందుకు ఆమె తండ్రి ప్రయత్నిస్తున్నారు. అత్యవసర వీసా (Emergency VISA) కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు వెంటనే సాయం చేయాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, భారత ఎంబసీని కోరుతున్నానని'' ఎంపీ సుప్రియా ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే భారత విదేశాంగ శాఖకు చెందిన అమెరికా విభాగం.. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నీలమ్ తండ్రిని అత్యవసర ప్రయాణానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.
Also Read: ముగిసిన కుంభామేళా.. వారికి రూ. 10 వేల బోనస్.. సీఎం యోగి కీలక ప్రకటన