/rtv/media/media_files/2025/02/27/7lk7IaCqToK2tFR4QGxV.jpg)
ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ఈ కీలక ప్రకటన చేశారు. కుంభమేళాలో పాల్గొనే పారిశుద్ధ్య కార్మికులకు అదనంగా రూ. 10 వేల బోనస్ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్ నెలలో ఉద్యోగుల ఖాతాల్లో ఈ డబ్బు జమవుతుందని సీఎం తెలిపారు. దీనితో పాటు వారికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా మొత్తాన్ని కూడా అందిస్తామన్నారు. యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు బ్రజేష్ పాఠక్, కేపీ మౌర్య, మంత్రివర్గంలోని ఇతర మంత్రులు గురువారం ప్రయాగ్‌రాజ్‌లోని అరయిల్ ఘాట్‌లో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు.
#WATCH | Prayagraj | Uttar Pradesh CM Yogi Adityanath says, "I thank the people of Prayagraj - those who from the last two months took this event (Maha Kumbh) as the event of their home. I can understand that the city has a population of 20-25 lakhs, and hence what would have… pic.twitter.com/lNW2G8RVv1
— ANI (@ANI) February 27, 2025
ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ, "ఇంత పెద్ద కుంభమేళా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 66.30 కోట్ల మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మౌని అమావాస్య నాడు 8 కోట్ల మంది భక్తులు స్నానం ఆచారించారు. ప్రతిపక్షాలు ప్రయాగ్‌రాజ్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నించాయి " అని సీఎం అన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కలిసి సీఎం యోగి భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి యోగితో పాటుగా చాలా మంది మంత్రులు హాజరయ్యారు.
ముగిసిన కుంభామేళా
45 రోజుల పాటు సాగిన మహా కుంభ మేళా బుధవారంతో ముగిసింది. జనవరి 13వ తేదీన ప్రారంభమై.. మహాశివరాత్రి రోజున ఘనంగా ముగిసింది. సుమారు 66 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. జనవరి 29న మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు చనిపోగా.. 60 మంది గాయపడ్డారు. కుంభామేళా ముగియడంతో మేళా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు పారిశుధ్య కార్మికులు రంగంలోకి దిగారు.
మళ్లీ కుంభమేళా ఎప్పుడంటే!
వచ్చే ఐదేళ్లలో హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాల్లో కుంభమేళా జరగనుంది. 2027 హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా ఏర్పాటు చేయనుండగా.. 2027లో నాసిక్‌లో కుంభమేళా జరగనుంది. జులై 17న ప్రారంభమయ్యే ఈ కుంభమేళా ఆగస్టు 17వ తేదీతో ముగుస్తుంది. త్రయంబకేశ్వర్‌లోని గోదావరి నది ఒడ్డున మేళా జరగనున్నది. ఉజ్జయినిలో 12 ఏండ్లకోసారి శిప్రా నది ఒడ్డున సింహస్థ కుంభమేళా నిర్వహిస్తారు. ఇది 2028లో జరగనున్నది. 2030లో ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళాను నిర్వహించనుంది.