Viral video: ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చార్రా బాబు.. సూటు బూటు వేసుకొని ఇవేం చేష్టలు..

మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో భోజనాల ప్లేట్ల కోసం కోట్లాడుకున్నారు. అన్నం కోసం కరువుప్రాంతం నుంచి వచ్చిన వారిలా ప్రవర్తించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

New Update
Global Investors Summit Viral video

Global Investors Summit Viral video Photograph: (Global Investors Summit Viral video)

లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులు భోజనాల ప్లేట్ల కోసం కోట్లాడుకున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో అన్నం కోసం కరువుప్రాంతం నుంచి వచ్చిన వారిలా ప్రవర్తించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ప్రపంచ స్థాయిలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఫుడ్ సరిగా పెట్టకపోవడం ఏంటని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మహిళలు, పురుషులు పోటీపడి మరీ భోజనా కోసం ప్లేట్లు గుంజుకున్నారు. ఈ తోపులాటలో కొన్ని ప్లేట్లు విరిపోయిపోయాయి కూడా. అక్కడకి వచ్చిన వారంత బిజినెస్ మ్యాన్లే, హై క్లాస్ డ్రెస్ అపిరియన్స్‌లో ఉన్నారు. కానీ తినే తిండి దగ్గర విఛిత్రంగా ప్రవర్తించారు. 

Also read : Smuggling: ఖజ్జూర పండ్లలో బంగారం, విగ్‌లో కొకైన్.. పుష్పా మించిన ట్విస్టులు (VIDEO)

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఫిబ్రవరి 24, 25 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు జరిగింది. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సమ్మిట్‌కు దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు వచ్చారు. మధ్య ప్రదేశ్‌లో రూ.26.61 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయనట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. ఈ పెట్టుబడులతో 17.3 లక్షల ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో కల్పించబడతాయని చెప్పారు. అన్నీ బానే ఉన్నాయ్ కానీ భోజనాలు సరిపడా ఏర్పాటు చేయలేకపోయారా అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Also read : త్వరలోనే భూమి అంతం.. న్యూటన్ చెప్పింది నిజం అవుతుందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు