/rtv/media/media_files/2025/02/27/2mL6tu0wIhNF1eYb8hc5.jpg)
shreya Ghoshal about Chikni Chameli
Shreya Ghoshal: స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడిన అనేక చార్ట్ బస్టర్లలో 'చిక్ని చమేలి' సాంగ్ ఒకటి. 2012లో విడుదలైన 'అగ్నిపథ్' సినిమాలోని పెద్ద హిట్ అయ్యింది. నేటికీ ప్రతి ఒక్కరి నోటిలో ఈ పాట లిరిక్స్ నానుతూనే ఉంటాయి. స్టార్ హీరోయిన్ కత్రినా ఈ పాటకు స్టెప్పులేశారు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ శ్రేయా ఘోషల్ 'చిక్ని చమేలి' పాట పాడినందుకు సిగ్గుపడుతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ పాటలోని సాహిత్యాన్ని ఉద్దేశించి ఆమె ఈ కామెంట్స్ చేశారు.
సిగ్గుగా ఉంది
ఆ పాటలోని అర్థం తెలియకుండానే చిన్నపిల్లలు దానిని పాడినప్పుడు, డాన్స్ వేసినప్పుడు తనకు సిగ్గుగా అనిపిస్తుందని తెలిపారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి మీ పాట చాలా బాగుంటుంది.. మీకోసం పాట పాడతాను అంటూ.. ఆ పాటను పాడుతుంటారు. ఆ సమయంలో నాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఐదు లేదా ఆరు సంవత్సరాలు ఉన్న చిన్న పాప అలాంటి పాట పాడడం సరైనది కాదని చెప్పుకొచ్చింది. అందుకే శ్రేయా ప్రస్తుతం తాను పాడటానికి ఎంచుకునే పాటల విషయంలో చాలా స్పృహలో ఉంటానని తెలిపింది. ముఖ్యంగా సాహిత్యం గురించి మరీ ప్రత్యేకంగా ఉంటానని చెప్పారు. పాటను పాడడానికి ముందు సాహిత్యం సరిగ్గా రాయబడిందా లేదా అనేది నిర్దారించుకుంటానని అన్నారు.
శ్రేయా ఘోషల్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాళీ ఇలా అన్ని భాషల్లో కలిపి 25వేలకు పైగా పాటలు పాడింది. 12ఏళ్ళ వయసులోనే పాటలు పాడడం మొదలు పెట్టిన శ్రేయా.. ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ సింగర్ గా రాణిస్తోంది. అంతేకాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సింగర్స్ లో ఆమె కూడా ఒకరు. శ్యేయా వాయిస్ కి లక్షల్లో అభిమానులు ఉన్నారు.
Also Read: Lucky Baskhar: ఇదేం క్రేజ్ రా బాబు.. 'లక్కీ భాస్కర్' ఎక్కడ వదలట్లేదు.. నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు