/rtv/media/media_files/2025/02/16/d9RvuQTt5OrfjHT4CR9v.jpg)
Groom Dies Of Heart Attack During Wedding Procession In Sheopur
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గుండెపోటుకు గురై చనిపోతున్నారు. తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఇటువంటి మరణాలు చూస్తూనే ఉన్నాం. టీవీ చూసి పడిపోవడం, డ్యాన్స్ చేస్తూ కుప్పకూలడం, మాట్లాడుతూనే నేలకొరగడం.. ఇలా చాలానే జరిగాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం వైరల్‌గా మారాయి.
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా
తాజాగా అలాంటి విషాదమే మరొకటి జరిగింది. మరికొద్ది సేపట్లో తాళికట్టబోతున్న వరుడు అకాస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. గుర్రంపై కళ్యాణ మండపానికి వెళ్లేందుకు గుర్రంపై ఎక్కాడు. అదే అతడికి చివరి శ్వాస అయింది. ఒక్కసారిగా అలా కిందకి పడిపోయాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు అయ్యో.. పాపం అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్!
డీజే పాటలకు డ్యాన్స్
మధ్యప్రదేశ్ రాష్ట్రం శియోపూర్ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. 25 ఏళ్ల వరుడు ప్రదీప్ మరికొద్ది సేపట్లో తనకు కాబోయే భార్య మెడలో తాళి కట్టనున్నాడు. ఈ లోపు పెళ్లి ఊరేగింపు జరిగింది. ఇక పెళ్లి ఊరేగింపు అన్నాక ఎవ్వరైనా చిందెయ్యాల్సిందే. అలాగే పెళ్లి కొడుకు ప్రదీప్ కూడా మంచి జోష్ ఉన్న డీజే పాటలకు డ్యాన్స్ చేశాడు.
గుండెపోటుతో పెళ్లిలోనే వరుడు మృతి
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2025
మధ్యప్రదేశ్ - శ్యోపుర్ జిల్లాలో పెళ్లి ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేసిన పెళ్లి కొడుకు ప్రదీప్ (26) మండపానికి వెళ్లేందుకు గుర్రం ఎక్కాడు
కాసేపటికే ప్రదీప్ గుండెపోటుకు గురికావడంతో సీపీఆర్ చేసి, ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని… pic.twitter.com/MYg8EEmkJn
Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!
గుర్రంపైనే తుదిశ్వాస
డ్యాన్స్ చేసిన అనంతరం అతడు గుర్రంపైకి ఎక్కాడు. అక్కడ నుంచి మండపానికి వెళ్లేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గుర్రంపై కూర్చున్న వరుడు ప్రదీప్ కాసేపటికే గుండెపోటుకు గురయ్యాడు. గుర్రంపై కూర్చున్న అతడు ఒక్కసారిగా అలా కిందకి వంగిపోయాడు. దీంతో పక్కనున్నవారు అది చూసి అతడికి సీపీఆర్ చేశారు. అనంతరం అతడిని సమీప హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో మృతుని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.