Byjus 3.0: త్వరలో బైజూస్ 3.0.. బైజూ రవీంద్రన్ సంచలన ప్రకటన

బైజూస్‌ కంపెనీ ఫౌండర్‌ బైజూ రవీంద్రన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో బైజూస్ 3.0ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి దశలో ఉందని పేర్కొన్నారు. అలాగే తమ కంపెనీలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదన్నారు.

New Update
Byjus 3.0 in the pipeline, Says Founder Byju Raveendran

Byjus 3.0 in the pipeline, Says Founder Byju Raveendran

బైజూస్‌ కంపెనీ 2022 నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ కంపెనీ ఫౌండర్‌ బైజూ రవీంద్రన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో బైజూస్ 3.0ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఏఎన్‌ఐతో జరిగిన పోడ్‌కాస్ట్‌లో ఆయన తన కంపెనీపై ఉన్న వివాదాలు, నిధులు దుర్వినియోగం గురించి పలు విషయాలు వెల్లడించారు. బైజూస్ 3.0 ఇప్పటికే అభివృద్ధి దశలో ఉందని పేర్కొన్నారు.  

Also Read: రాయబారులతో రాసలీలలు.. హైదరాబాద్ లేడీ యూట్యూబర్స్‌తో జ్యోతికి సంబంధాలు!

'' ఇది నా జీవిత పని. ఈసారి మరింత స్పష్టతతో మేము దీన్ని మళ్లీ నిర్మిస్తున్నాం. మా బృందంలోని కీలకమైన సభ్యులు దీని అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. భారత్‌తో పాటు విదేశాల్లో మా కంపెనీపై చట్టపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ మేము మా పని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ప్రతీ విద్యార్థికి కూడా ఒక వ్యక్తిగత ట్యూటర్‌ను సృష్టించేందుకు జెనిరేటీవ్‌ ఏఐ (AI)ని వినియోగించుకునేందుకు కంపెనీ సిద్ధమవుతోందని'' రవీంద్రన్ తెలిపారు.

Also Read: మాయలేడి జ్యోతి.. పాక్‌ డబ్బుతో టూర్లు, లగ్జరీ హోటల్స్‌లో విలాసం

అలాగే తన కంపెనీ నిధులు దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలను రవీంద్రన్ ఖండించారు. 2021లో యూఎస్‌ టర్మ్‌ లోన్‌ ద్వారా సేకరించిన 1.2 బిలియన్‌ డాలర్లు వ్యాపార వృద్ధికి కోసం వినియోగించామని స్పష్టం చేశారు. కంపెనీని స్వాధీనం చేసుకునేందుకు రుణదాతలు కోర్టు కార్యకలాపాలపై తప్పుడు కథనాలు సృష్టించారని ఆరోపించారు.  తాము కోర్టురూమ్లకు చెందిన వాళ్లమి కాదని.. క్లాస్‌ రూమ్‌లకు చెందినవాళ్లమన్నారు. తమని నమ్మిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకులకు రుణపడి ఉన్నామని.. అందుకే బైజూస్‌ను మేము విడిచిపెట్టడం లేదని చెప్పారు. బైజూస్‌ 3.0 అనేది మా లక్ష్యాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. 

Also Read: రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు ఎస్సీ వర్గీకరణ అమలు

 

rtv-news | byju-ravindran

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు