Byju's : మూతబడ్డ బైజూస్ ఆఫీసులు.. ఇంటి నుంచే ఉద్యోగులకు పని
బైజూస్ కష్టాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. వీటినుంచి ఈ ఎడ్టెక్ సంస్థ ఇప్పటప్పటిలో తేరుకునేలా లేదు. తాజాగా ఆర్ధిక భారం తట్టుకోలేక దేశ వ్యాప్తంగా ఉన్న బైజూస్ ఆఫీసులన్నింటినీ ఖాళీ చేయించాలని నిర్ణయించుకుంది.