BYD Cars: అదానీ చేతుల్లోకి మరో బిగ్ కంపెనీ.. ఇండియాలో బీవైడీ కార్లు

టెస్లా కార్లకు పోటీగా చైనా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ బీవైడీ. ఇప్పటికే ఈ కార్లు ఇండియాలో తెగ తిరుగుతున్నాయి. అందుకే వీటిని ఇక్కడే తయారు చేసే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

New Update
Byd Electric Cars

Byd Electric Cars

చైనా ఉత్పత్తి చేస్తున్న ఎలక్ట్రిక్ కార్స్ బీవైడ్(Electric Cars BYD)సీపర్ హిట్ అయ్యాయి. టెస్లాకు పోటీగా వీటిని తీసుకొచ్చింది డ్రాగన్ కంట్రీ. అయితే టెస్లా కన్నా వీటికి మంచి పేరు వచ్చింది. దానికి తోడు టెస్లా లో రెండే మోడల్స్ ఉండగా..బీవైడీలో చాలా ఉన్నాయి. సెడాన్, ఎస్యూవీలు కూడా బీవైడీలో ఉన్నాయి. త్వరలోనే మన దేశంలో బీవైడీఅట్టో 2 కాంపాక్ట్‌ సెడాన్‌ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే అంతకు మించి ఈ కార్లను భారత్ లోనే తయారు చేసేలా కంపెనీతో సంప్రదింపులు జరుపుతోంది భారత ప్రభుత్వం.

ట్రంప్ సుంకాల(Trump Tariffs) దెబ్బకు భారత్, చైనా(India-China) మధ్య స్నేహం మళ్ళీ చిగురించింది. అంతకు ముందు చైనా సంస్థల వైపు చూడనిప్రభుత్వం..ఇప్పుడు వాటిని మన దేశానికి తీసుకువచ్చే ప్లాన్ లు వేస్తోంది. ఇప్పటికే కొన్ని చర్చలు జరిగాయి. ఇప్పుడు బీవైడీ(BYD Cars) తన ఉన్నత స్థాయి అధికార్ల బృందాన్ని చైనా నుంచి మనదేశానికి పంపిస్తోంది. అంతకు ముందు బీవైడీ కార్లు బాగా హిట్ అయినా కూడా సుంకాలు ఎక్కువ పడుతుండడ వలన కార్ల ఖరీదు ఎక్కువై వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి భారత్ లోనే కార్లను తయారు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ యోచిస్తోంది. దీంతో మనదేశంలో విస్తరించడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయడంలో బీవైడీ ప్రయత్నాలు చేస్తోంది. దాంతో పాటూ వచ్చే 6 నెలల్లో అట్టో 2 మోడల్‌ కారును తక్కువ ధరలో మనదేశంలో విడుదల చేయాలని బీవైడీ సంస్థ భావిస్తోంది. ఈ సంస్థ నుంచి వచ్చే అధికారులు మన ప్రభుత్వ అధికార్లు, మంత్రులతో సంప్రదింపులు చేయనున్నారు.

Also Read :  ముసలోడు కాదు...మూర్ఖుడు..11 ఏళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

అదానీ గ్రూప్ తో టై అప్..

బీవైడీఎలెక్ట్రిక్ కార్లలో లిథియామ్ అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తోంది. ఇప్పుడు వీటి ఉత్పత్తి కోసం కంపెనీ భారత దిగ్గజాల్లో ఒకటౌైనఅదానీ గ్రూప్ ను అప్రోచ్ అవుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా సంస్థతో బస్సుల తయారీ భాగస్వామ్య ఒప్పందం ఎన్నో ఏళ్లుగా బీవైడీకి ఉంది. ట్రక్కుల ఉత్పత్తి కోసం బీవైడీ, హైదరాబాద్‌కే చెందిన మరొక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇప్పుడు కార్లను వీటితో సంబంధం లేకుండా తీసుకురావాలని అనుకుంటోంది. దీని కోసం ఏదైనాస్థార సంస్థతో భాగస్వామ్యం చేసుకోవాలని అనుకుంటోంది. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు బీవైడీ ముందుకు వచ్చింది. ఇక్కడే కార్లను తయారు చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం దీన్నిధృవీకరించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా అనుమతులు రాలేదు. ఇప్పుడు మారి పరిస్థితుల బట్టి ఈ ప్రపోజల్ ముందుకు వెళ్ళవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Also Read: Nepal: హెలికాఫ్టర్ తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు.. నేపాల్ లో భయానక దృశ్యం

Advertisment
తాజా కథనాలు