/rtv/media/media_files/2025/11/02/buffalo-2025-11-02-17-31-31.jpg)
Buffalo Worth RS.21 Crores Dies At Rajasthans Pushkar Animal Fair
రాజస్థాన్(rajasthan) లోని అజ్మీర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పశువుల సంతలో రూ.21 కోట్ల విలువైన గేదె మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని పుష్కర్‌లో ఏటా పశు మేళాను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాగే అక్టోబర్ 30న పశు మేళా గ్రాండ్‌గా ప్రారంభమయ్యింది. అక్కడ రూ.21 కోట్ల విలువైన భారీ గేదె అందరిని ఆక్టటుకుంది. అయితే అక్టోబర్ 31న ఆ పశు ప్రదర్శనలో ఉంచి ఆ గేదె ఆరోగ్యం క్షీణించింది.
Also Read: పెళ్లి పేరుతో గర్భవతిని చేసి మోసం చేసిన ప్రియుడు.. ఇంటిముందు ప్రియురాలి ధర్నా
Buffalo Worth RS.21 Crores Dies
సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ గేదెకు చికిత్స అందించారు. కానీ దాని భారీ శరీర బరువు, తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో వైద్యం అందించిన ఫలితం లేకుండా పోయింది. చివరికి ఆ గేదె మృతి చెందింది. దాని మృతి పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ గేదె ఎక్కువ లావుగా కనిపించేందుకు వివిధ రకాల డ్రగ్స్ ఇచ్చి ఉండొచ్చని పశు వైద్యులు అనుమానిస్తున్నారు.
చనిపోయిన ఆ భారీ గేదెను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలాఉండగా రాజస్థాన్‌లో ఏటా నిర్వహించే ఆ పశు ప్రదర్శకు వేలాది మంది జనాలు వస్తుంటారు. అక్టోబర్ 30న ఈ పశు మేళా నవంబర్ 5తో ముగియనుంది.
भैंस 🐃 का मालिक 21 करोड़ मांग रहा था इस भैंस 🐃 का...और लोग 9 करोड़ तक देने को तैयार थे लेकिन उसने बेचा नहीं...
— JosD92 (@JosD92official) November 2, 2025
और आज उस भैंस 🐃 की मेले में ही मौत हो गई ..
Buffalo 🐃 worth 21 crore dies in Pushkar fair 😐 people were ready to give 9 crore but he didn't sell it.. pic.twitter.com/egOeEWdzz0
 Follow Us