/rtv/media/media_files/2025/11/02/telangana-youtuber-syed-hafeez-2025-11-02-15-58-19.jpg)
telangana youtuber syed hafeez
ఏదైనా సమాచారం గురించి తెలుసుకునేందుకు గూగుల్‌తో పాటు చాలామంది వినియోగించే ప్లాట్‌ఫామ్ యూట్యూబ్. ఇందులో ప్రతిరోజూ లక్షలాది వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. చాలామంది కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్‌నే తమ జీవనాధారంగా చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే తెలుగులో ఓ ప్రముఖ టెక్ యూట్యూబర్‌కు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బంపరాఫర్ ప్రకటించింది. అతనే తెలుగు టెక్ ట్యూట్స్ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న సయ్యద్ హఫీజ్(Telangana YouTuber Syed Hafeez). ఈ గోల్డెన్ వీసా ద్వారా అతడు పదేళ్ల పాటు యూఏఈలో తన కుటుంబ సభ్యులతో సహా జీవించే అవకాశం ఉంటుంది.
Also Read: దెయ్యాలతో ఆటాడుకున్న లాలూ ప్రసాద్ యాదవ్.. BJP విమర్శలు
Telangana YouTuber Syed Hafeez Receives UAE Golden Visa
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్.. మొదటగా యూట్యూబ్‌లో వీడియోలు చేసినప్పుడు పెద్ద వ్యూస్ వచ్చేవి కావు. అయినా అతడు నిరాశ చెందకుండా కొత్త కొత్త టెక్ కంటెంట్‌తో వీడియోలు అలానే అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం 1.79 మిలియన్ సబ్‌స్క్రైబర్లతో టాప్ టెక్ యూబ్యూటర్‌గా కొనసాగుతున్నాడు. అతని కృషికి ఫలితంగానే యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందించింది.
2011లో హఫీజ్ తెలుగు టెక్ ట్యూబ్ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. మొబైల్ రివ్యూలు, ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించే మార్గాలు, మొబైల్స్‌లో సెక్యూరిటీ ట్రిక్స్ లాంటి కంటెంట్‌తో వీడియోలు అప్‌లోడ్ చేసేవాడు. 2018లో హఫీజ్ యూట్యూబ్ ఛానెల్‌కు సోషల్ మీడియా సమ్మిట్ అవార్డు వచ్చింది. అలాగే 2019లో టాప్ తెలుగు క్రియేటర్ల జాబితాలో చోటు దక్కింది. అంతేకాదు 2022లో ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్ జాబితాలో చోటు సాధించడంతో పాటు బెస్ట్ తెలుగు టెక్ క్రియేటర్‌గా హఫీజ్‌కు అవార్డు వచ్చింది.
Also Read: ట్రంప్ టారిఫ్‌లపై.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
యూట్యూబ్‌లో ప్రస్తుతం హఫీజ్ నెలకు దాదాపు రూ.3 లక్షలు సంపాదిస్తున్నాడు. యూట్యూబ్ కాకుండా బ్రాండ్ డీల్స్, స్పాన్సర్షిప్స్, యాప్ ప్రమోషన్స్ ద్వారా నెలకు రూ.2 నుంచి 3 లక్షల ఆదాయం వస్తోంది. ఈ క్రమంలోనే హఫీజ్ కృషిని గుర్తించిన UAE ప్రభుత్వం అతనికి ఈ గోల్డెన్ వీసా జారీ చేసింది. యువతకు ఉచిత వర్క్‌షాప్‌లు, ఆన్‌లైన్ గైడెన్స్ ప్రోగ్రామ్‌లు, స్మార్ట్ డిజిటల్ కెరీర్ మార్గాలు చూపించాలనుకుంటున్నానని.. హఫీజ్ తెలిపారు.
Follow Us